బార్సిలోనా జట్టు కొంచెమైనా గౌరవమివ్వలేదు, మేం ఆశించలేదు కూడా: రియల్ మాడ్రిడ్ జట్టు కోచ్

Posted By:
Barcelona didnt provide us a guard of honour and even we wont: Real Madrid coach Zinedine Zidane

హైదరాబాద్: బార్సిలోనా జట్టు ఇసుమంతైనా గౌరవం చూపెట్టలేదని రియల్ మాడ్రిడ్ జట్టు జిన్‌డిన్ జిదానె అన్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లపై బార్సిలోనా ప్రదర్శించిన వైఖరిని చూస్తుంటే చిరాకు తెప్పిస్తుందన్నాడు. రియల్ మాడ్రిడ్, అట్లెటికో జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 1-1స్కోరుతో డ్రా అయింది. అయినా బార్సిలోనాను లీగ్ పట్టికలో 11పాయింట్లతో టాప్ స్థానం సంపాదించుకుంది.

ఇదైనా ఇప్పటి తంతు కాదు దాదాపు 2016 సంవత్సరం నుంచి బార్సిలోనా జట్టు ఇలానే ప్రవర్తిస్తుందని విమర్శించాడు. ప్రత్యర్థులు ఫిఫా క్లబ్ టైటిళ్లు గెలుచుకున్న సందర్భాల్లో ఏ మాత్రం శుభాకాంక్షలు తెలుపకుండా మర్యాదహీనంగా వెళ్లిపోవడం బాగాలేదన్నారు.

'త్వరలోనే ఈ విషయంపై ఆ జట్టుతో మాట్లాడనున్నాను. నాకు తెలుసు. అటు నుంచి కేవలం ఒకే సమాధానం వస్తుంది. మా నిర్ణయం ఇలానే ఉంటుంది. అది మా ఇష్టం అనే స్థాయిలో వాళ్లు మాట్లాడతారు. ఇలా ఆటలోని సంప్రదాయాలను ఉల్లంఘించడం వాళ్లకు అలవాటే' అని వివరించాడు.

'ఒకవేళ రియల్ మాడ్రిడ్ జట్టు మర్యాదకు నోచుకోని జట్టా అంటే అదేం కాదు. కేవలం రియల్ మాడ్రిడ్ జట్టులోని క్రిస్టియన్ రొనాల్డొ ఒక్కడే ఈ లీగ్‌లో 38 గోల్ లను సంపాదించాడు.' మరి అలాంటప్పుడు ఇలా ప్రవర్తించడం సబబు కాదని పేర్కొన్నాడు. కాగా, రియల్ మాడ్రిడ్ జట్టు జ్యూవెంటస్‌తో క్వార్టర్స్ ఫైనల్‌లో తలపడి 3-0తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, April 10, 2018, 17:48 [IST]
Other articles published on Apr 10, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి