న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

AFC Women's Asian Cup: 12 మంది క్రీడాకారిణులకు పాజిటివ్‌.. టోర్నీ నుంచి భారత్ ఔట్!

AFC Womens Asian Cup: Covid outbreak forces hosts India out of tourney

ముంబై: ఆసియా ఫుట్‌బాల్ కప్ టోర్నీ నుంచి భారత మహిళల జట్టు అనివార్యపరిస్థితులతో తప్పుకుంది. భారత జట్టులో 13 మంది క్రీడాకారిణులకు కరోనా సోకడంతో చైనీస్ తైపీతో ఆదివారం జరగాల్సిన గ్రూప్-ఎ మ్యాచ్‌ చివరి నిమిషంలో రద్దయింది. మరో ఇద్దరు గాయాలతో జట్టుకు దూరమవడంతో మ్యాచ్‌కు కావాల్సిన 13 మందిని భారత జట్టు సిద్దం చేయకలేపోయింది. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌కు సిద్దం కాలేకపోయిన భారత జట్టు పోటీల నుంచి విత్‌డ్రా చేసుకున్నట్లుగా భావించి చైనీస్ తైపీని విజేతగా ప్రకటించారు.

'పాజిటివ్‌ కేసులు నమోదవడంతో చైనీస్‌ తైపీతో మ్యాచ్‌కు అవసరమైన 13 మందిని బరిలో దించడంలో భారత్‌ విఫలమైంది. ఆర్టికల్ 4.1 ప్రకారం మ్యాచ్‌కు సిద్దంగా లేని జట్టును పోటీల నుంచి విత్‌డ్రా చేసుకున్నట్లుగా పరిగణిస్తారు'' అని ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్( ఏఎఫ్‌సీ) ప్రకటించింది. ప్రతీకూల పరిస్థితులతో భారత్ టోర్నీ నుంచి తప్పుకోవడంపై ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ విచారం వ్యక్తం చేశారు.

'జట్టు ఇలాంటి అనివార్య పరిస్థితులను ఎదుర్కొవడం చాలా బాధకరం. ఆటగాళ్ల ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనేలేదు. వైరస్ సోకిన ఆటగాళ్లంతా త్వరగా కోలుకోవాలి.'అని ఆకాంక్షించాడు.

Story first published: Monday, January 24, 2022, 11:58 [IST]
Other articles published on Jan 24, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X