న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌: ఉసూరుమనిపించిన భారత్, బంగ్లాతో మ్యాచ్‌ డ్రా

Adil Khans late strike helps India draw Bangladesh 1-1 in World Cup qualifier

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌‌లో బోణీ కొట్టాలని భావించిన భారత పుట్‌బాల్ జట్టు మరోసారి నిరాశపరిచింది. ఈ టోర్నీలో భాగంగా ఖతార్‌ లాంటి పెద్ద జట్టును నిలువరించి ఆశ్చర్యపరిచిన భారత్‌.. బలహీన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసింది. ఫలితంగా మంగళవారం ఆ జట్టుతో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగించింది.

తొలి అర్ధభాగంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన ప్రపంచ భారత్ చివర్లో అనూహ్యంగా ప్రత్యర్థికి గోల్ సమర్పించుకుంది. 42వ నిమిషంలో బంగ్లా ప్లేయర్ సాద్‌ ఉద్దీన్‌ గోల్‌ కొట్టి బంగ్లాను ఆధిక్యంలో నిలిపాడు. ఇక, రెండో అర్దభాగంలో బంగ్లా ఆటగాళ్లు మరింతగా రెచ్చిపోవడంతో భారత్ జట్టు కేవలం రక్షణాత్మక ధోరణికే పరిమితమైంది.

ప్రస్తుత సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి.. అందుకు సిద్ధంగా ఉన్నా!ప్రస్తుత సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి.. అందుకు సిద్ధంగా ఉన్నా!

ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ.. ఈ మ్యాచ్‌లో తన తొందరపాటు వల్ల ప్రత్యర్ధి జట్టుకు గోల్ సమర్పించుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జమాల్ భుయాన్ 42వ నిమిషంలో మిడ్‌ఫీల్డ్ నుంచి షాట్ ఆడగా... దానిని అడ్డుకునేందుకు పోస్ట్ వదిలి ముందుకొచ్చిన సంధూ.. బంతిని తప్పుగా అంచనావేశాడు.

అమాంతం గాల్లోకి ఎగిరినా బంతి అతడి చేతికి చిక్కలేదు. దీంతో గోల్‌పోస్ట్ పక్కనే కాచుకొని ఉన్న సాదుద్దీన్ బంతిని సునాయాసంగా గోల్ పోస్ట్‌లోకి పంపించి బంగ్లాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే, మ్యాచ్ ముగియడానికి కొన్ని క్షణాల ముందు భారత ఆటగాడు ఆదిల్ ఖాన్ 88వ నిమిషంలో అదిల్‌ ఖాన్‌ గోల్‌ కొట్టడంతో మ్యాచ్‌ను డ్రాచేసుకోగలిగింది.

భారత్ vs దక్షిణాఫ్రికా రెండో టెస్టు.. ఒంటిచేత్తో వీవీఎస్‌ లక్ష్మణ్ సూపర్ క్యాచ్ (వీడియో)!!భారత్ vs దక్షిణాఫ్రికా రెండో టెస్టు.. ఒంటిచేత్తో వీవీఎస్‌ లక్ష్మణ్ సూపర్ క్యాచ్ (వీడియో)!!

కచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్‌కి సుమారు 65 వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. అయితే, భారత మాత్రం ఉసూరుమనిపించింది. క్వాలిఫయర్స్‌ తొలి మ్యాచ్‌లో 1-2తో ఒమన్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఖతార్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది.

దీంతో గ్రూప్-ఈ రెండో రౌండ్‌లో మూడు మ్యాచ్‌లాడిన భారత్ రెండు డ్రాలు, ఓ ఓటమితో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్రస్తుతం గ్రూప్‌లో 4వ స్థానంలో నిలిచింది. ఇక, నవంబర్ 14న జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Story first published: Wednesday, October 16, 2019, 11:53 [IST]
Other articles published on Oct 16, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X