ఫిఫా ’18 ఎవరికి?: జర్మనీతోపాటు ఆ మూడు జట్లు ఢీ అంటే ఢీ.. రష్యా కూడా పోటీ?!!

Posted By:
4 dark horses going into the FIFA World Cup 2018

హైదరాబాద్: బ్రెజిల్‌లోని మారకానా స్టేడియంలో 75 వేల మందికి పైగా అభిమానుల సమక్షంలో నాలుగేళ్ల క్రితం 2014 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ పోటీలో అర్జెంటీనాను జర్మనీ ఎక్స్ట్ ట్రా టైంలో 1 - 0 స్కోర్ తేడాతో ఓడించింది. మరోవైపు వివిధ దేశాల్లో లక్షల మంది టీవీ వీక్షిస్తుండగా హోరా హోరీ సాగిన మ్యాచ్ ఇది.

కానీ సమయం మన కోసం ఆగదుగా. నాలుగేళ్లు అప్పుడే గడిచిపోయాయి. 2018 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు యావత్ రష్యా సిద్ధమైంది. వచ్చే జూన్ 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు '2018 ఫిఫా వరల్డ్ కప్'కు ఆతిథ్యం ఇచ్చేందుకు రష్యా సన్నద్ధం అవుతోంది.

ఆటగాళ్లు, అభిమానుల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు:

ఆటగాళ్లు, అభిమానుల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు:

దేశంలోని అన్ని ప్రముఖ స్టేడియంలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు, వారి అభిమానుల కోసం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఏయే దేశాల జట్లు టోర్నమెంట్‌లో పాలుపంచుకుంటాయన్న సంగతి బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలాగే ఫైనల్స్ టోర్నీకి ఏయే జట్లు హాట్ ఫేవరెట్లుగా మారతాయి, డార్క్ హార్సెస్‌గా అవతరిస్తాయన్నది చూడాల్సిందే.

 అర్జెంటీనాతోపాటు ఫ్రాన్స్, స్పెయిన్ కూడా గట్టి పోటీ:

అర్జెంటీనాతోపాటు ఫ్రాన్స్, స్పెయిన్ కూడా గట్టి పోటీ:

గత అనుభవాల నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ -2018 డార్క్ హార్సెస్ జట్లు ఏవన్నది అంచనా వేసేందుకు స్కోప్ ఉంది. ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ వరుసగా ఐదో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకోవడానికి తహతహలాడుతోంది. దీంతోపాటు రికార్డులు నెలకొల్పిన బ్రెజిల్ కూడా అదే స్థాయిలో టైటిల్ గెలుచుకునేందుకు పోటీ పడుతూనే ఉన్నది. వీటితోపాటు ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా జట్లు కూడా రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ - 2018 టైటిల్ కైవసం చేసుకునేందుకు తహతహలాడుతున్నాయి.

రష్యా నాకౌట్ దశకు చేరుతుందా? అని సందేహాలు:

రష్యా నాకౌట్ దశకు చేరుతుందా? అని సందేహాలు:

డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీతోపాటు మిగతా ఐదారు దేశాలు.. వాటితోపాటు ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నరష్యా సైతం ఈ దఫా తానూ గట్టి పోటీ ఇవ్వగలనని విశ్వసిస్తోంది. ఆతిథ్య జట్టు అసలు నాకౌట్ దశకైనా వెళుతుందా? సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో 32 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో నాలుగు జట్లు మాత్రమే అత్యంత ప్రామిసింగ్ డార్క్ హార్సెస్ జట్లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

గతేడాది సెప్టెంబర్‌లో ఫిఫాలో సౌదీకి అర్హత :

గతేడాది సెప్టెంబర్‌లో ఫిఫాలో సౌదీకి అర్హత :

2018 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఎలాగైనా కప్ గెలుచుకోవాలని సౌదీ అరేబియా అవసరమైన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గ్రూప్ దశ వరకు మాత్రమే చేరుకున్న సౌదీ అరేబియా జట్టు ఈ ఏడాది జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్ కోసం గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో అర్హత సాధించింది. చివరకు సౌదీ అరేబియా ఫుట్‌బాల్ అభిమానులు కూడా తమ జట్టు క్వాలిఫై అవుతుందని ఊహించనంత వేగంగా ఆ జట్టు ఎదిగింది.

 గ్రూప్ ‘ఎ' జట్టులో తలపడనున్న సౌదీ:

గ్రూప్ ‘ఎ' జట్టులో తలపడనున్న సౌదీ:

సౌదీ అరేబియాకు ఇది వరుసగా ఐదో ఫిఫా వరల్డ్ కప్. ఇంతకుముందు 1994, 1998, 2002, 2006 టోర్నమెంట్లకు కూడా అర్హత సాధించింది. 2010, 2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల నుంచి గ్రీన్ పాల్కోన్స్ జట్టు తప్పిపోయినా గతేడాది జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తిరిగి అర్హత సాధించింది. ఈ ఏడాది జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంటులో పాల్గొనే సౌదీ అరేబియా జట్టు ‘గ్రూప్ ఎ'లో రష్యా, ఈజిప్టు, ఉరుగ్వే జట్లతో తలపడనున్నది. త్వరలో జరిగే ఈ టోర్నమెంటులో చాలా తేలికైన గ్రూప్ ఇది.

లా లీగా టోర్నీల్లో అనుభవం కోసం సౌదీ ఆటగాళ్ల కష్టాలిలా

లా లీగా టోర్నీల్లో అనుభవం కోసం సౌదీ ఆటగాళ్ల కష్టాలిలా

ఒకవేళ గ్రీన్ ఫాల్కోన్స్ జట్టు, ఆఫ్రికా, సౌత్ అమెరికా జట్లపై విజయం సాధిస్తే.. సౌదీ అరేబియా జట్టుకు మంచి అవకాశాలు లభిస్తాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2018 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా పలువురు సౌదీ అరేబియా క్రీడాకారులు అనుభవం సంపాదించేందుకు స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంటులో వివిధ క్లబ్‌ల తరఫున ఆడుతున్నారు.

Story first published: Friday, April 13, 2018, 13:22 [IST]
Other articles published on Apr 13, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి