న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక చాలు!: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న మరో కెప్టెన్

Zimbabwe captain Hamilton Masakadza announces retirement from all forms of cricket

హైదరాబాద్: జింబాబ్వే కెప్టెన్ హామిల్టన్ మసకాడ్జా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌లతో సెప్టెంబర్ 13 నుంచి 24వరకు జరగనున్న ముక్కోణపు టీ20 సిరిస్ తన ఆఖరి టోర్నమెంట్ అని వెల్లడించాడు. ఈ మేరకు జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

ఆవిష్కరించిన ఖతార్‌: 2022 ఫిఫా వరల్డ్‌కప్ లోగోను చూశారా!ఆవిష్కరించిన ఖతార్‌: 2022 ఫిఫా వరల్డ్‌కప్ లోగోను చూశారా!

అన్ని రకాల ఫార్మెట్లకు దూరం

అన్ని రకాల ఫార్మెట్లకు దూరం

"హామిల్టన్ మసకాడ్జా బంగ్లాదేశ్‌లో జరిగే టీ20 ముక్కోణపు సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మెట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు" అంటూ జింబాబ్వే క్రికెట్ తన ట్విట్టర్‌లో వెల్లడించింది. హామిల్టన్ మసకాడ్జా 2001లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

నాలుగో ఆటగాడిగా

నాలుగో ఆటగాడిగా

జింబాబ్వే తరుపున ఇప్పటివరకు 38 టెస్టులు, 209 వన్డేలు, 62 టీ20లు ఆడి మొత్తం 9,410 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జింబాబ్వే తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో పది సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా హామిల్టన్ మసకాడ్జా గుర్తింపు పొందాడు.

ఐసీసీ నిషేధం విధించిన తర్వాత

ఐసీసీ నిషేధం విధించిన తర్వాత

ఈ ఏడాది జులైలో జింబాబ్వే జట్టుపై ఐసీసీ నిషేధం విధించిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రెండో ఆటగాడు హామిల్టన్ మసకాడ్జా. మసకాడ్జాకు ముందు సోలోమన్ మైర్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డులోని సభ్యులను అక్కడి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ కమిటీ తొలగించడంతో ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్​ నుంచి సస్పెండ్​ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

జింబాబ్వేపై వేటు

జింబాబ్వేపై వేటు

ఆర్టికల్‌ 2.4(సి) (డి) నిబంధనను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేసింది. ఫలితంగా ఐసీసీ నుంచి వచ్చే నిధులు ఆగిపోవడంతో పాటు ఏ టోర్నీల్లోనూ ఆ జట్టు ఆడేందుకు వీలు లేదు. మూడు నెలల్లో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సభ్యులను తిరిగి నియమించాలని గడువు విధించింది. అంతేకాదు క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్‌ కొనసాగాలని ఐసీసీ స్పష్టం చేసింది.

Story first published: Wednesday, September 4, 2019, 14:47 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X