న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెస్ వల్లే క్రికెట్‌లో రాణిస్తున్నా: చహల్

Yuzvendra Chahal Says Being Excellent At Chess For Teaching Him Patience In Bowling

చెన్నై: మైదానంలో ప్రశాంతంగా క్రికెట్ ఆడటానికి చెస్‌ ఆడిన అనుభవమే కారణమని టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్ తెలిపాడు. ఇక క్రికెట్‌లోకి రాక ముందు చహల్ చెస్ ప్లేయర్. జాతీయ అండర్-12 చాంపియన్‌‌గా కూడా నిలిచాడు. అంతేకాక ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియనషిప్‌‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1956 ఎలో రేటింగ్‌తో వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐడీఈ) వెబ్‌సైట్‌లో స్థానం కూడా సంపాదించాడు.

అనంతరం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొని ఉత్తమ స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ఇంటికే పరిమితమవడంతో చహల్ తనకి ఇష్టమైన చెస్‌ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికగా బ్లిట్జ్‌ ఈవెంట్‌ ఆడుతున్నాని తెలిపాడు.

అందుకే క్రికెట్ ఎంచుకున్నా..

అందుకే క్రికెట్ ఎంచుకున్నా..

‘చెస్‌ నాకు ఎంతో ప్రశాంతత నేర్పింది. క్రికెట్‌లో కొన్నిసార్లు గొప్పగా బౌలింగ్‌ చేసినా వికెట్లు సాధించలేం. టెస్టు మ్యాచ్‌లో రోజంతా బౌలింగ్‌ చేసినా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయలేం. మళ్లీ మరుసటి రోజు నూతన ఉత్సాహంతో బరిలోకి దిగాలి. అలాంటి సందర్భాల్లో చెస్‌ ఆడిన అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రశాంతతో ఉండి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయగలను. చెస్‌, క్రికెట్‌ రెండూ ఇష్టమే. అయితే ఏది ఎంచుకోవాలని మా నాన్నని అడిగాను. నీకు ఇష్టమైనది ఎంపిక చేసుకో అని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసక్తి ఉన్న క్రికెట్‌ను కెరీర్‌గా సెలక్ట్‌ చేసుకున్నా' అని చాహల్‌ తెలిపాడు.

నా కెరీర్‌లో అదే గొప్పది..

నా కెరీర్‌లో అదే గొప్పది..

‘ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ను ఔట్‌ చేయడం నా కెరీర్‌లో గొప్పదిగా భావిస్తా. ఎందుకంటే అది నా తొలి ప్రపంచకప్‌. కీలక మ్యాచ్‌లో ముఖ్యమైన వికెట్‌ పడగొట్టా. బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించే ముందు నా ప్రణాళికను వికెట్‌ కీపర్‌కు వివరిస్తా. ముఖ్యంగా ధోనీ భాయ్‌కు నా ప్లాన్‌ను చెప్పడాన్ని ఎంతో ఆస్వాదిస్తా' అని చహల్ పేర్కొన్నాడు.

ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నా..

ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నా..

కరోనా కారణంగా ఇంటికి పరిమితమవ్వడంపై చహల్‌ స్పందిస్తూ ఈ సమయాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ‘మా కుటుంబంతో ఇంత సమయాన్ని ఎప్పుడూ గడపలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా ఇంట్లో ఉంటున్నా. కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నా. ఆలస్యంగా పడుకోవడం, నిద్ర లేవడం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండండి. ఐక్యంగా ఉంటేనే మహమ్మారి కరోనాపై పోరాడగలం. ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదవడం, డ్యాన్స్‌ వేయడం, వంట చేయడం వంటివి చేస్తూ టైంపాస్ చేయండి'అని చహల్ తెలిపాడు.

Story first published: Monday, April 6, 2020, 19:56 [IST]
Other articles published on Apr 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X