న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఢిల్లీ ఓటమితో ఎలాంటి ఒత్తిడి లేదు.. కచ్చితంగా సిరీస్ గెలుస్తాం'

India vs Bangladesh 2019 : Yuzvendra Chahal Says 'No Pressure On India Despite Delhi Defeat'
Yuzvendra Chahal said No pressure on India despite Delhi defeat


రాజ్‌కోట్‌: ఢిల్లీలో జరిగిన తొలి టీ20 ఓటమితో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అయితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు యువ ఆటగాళ్లపై జట్టు యాజమాన్యంకు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ కోసం చాలా మంది యువకులకు బీసీసీఐ జట్టులో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 జరగనుంది.

డే-నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లు.. గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ!డే-నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లు.. గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ!

మంగళవారం చహల్ మాట్లాడుతూ... 'ప్రస్తుతం ఆడుతున్న 11 మంది, జట్టులోని 15 మంది ఆటగాళ్లకు తమ పాత్రలు ఏంటో తెలుసు. ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత బయటకు వెళ్లిపోరు. రెండు మ్యాచ్‌లలో విఫలమయినంత మాత్రాన మేనేజ్‌మెంట్ నుండి ఎటువంటి ఒత్తిడి ఉండదు. అయితే ఒక మ్యాచ్‌లో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు. మేము సానుకూలంగానే ఉన్నాం. గతంలో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి సిరీస్‌ను గెలిచిన సందర్భాలు ఉన్నాయి' అని అన్నాడు.

'గత మ్యాచ్ గురించి ఆలోచిస్తే.. అన్ని నెగటివ్ ఆలోచనలే వస్తాయి. మేము రాజ్‌కోట్‌కు రాకముందే ఢిల్లీ ఓటమిని మర్చిపోయాం. సిరీస్‌ను కొత్తగా ప్రారంభిస్తాం. జట్టులోని 15 మంది సానుకూలంగా ఉన్నారు. మేము కచ్చితంగా సిరీస్ గెలుస్తాం. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక్కడి వికెట్ బాగుంది. బంతి బాగా టర్న్ అయ్యే అవకాశం ఉంది' అని చహల్ పేర్కొన్నాడు.

ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు వాయు కాలుష్యం ఇబ్బందిపెట్టినప్పటికీ ఆటగాళ్లు ఆడారు. ఆ గండం గట్టెంకిందనుకుంటే.. రెండో టీ20కి వరణుడు అడ్డుపడే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 'సైక్లోన్ మహా' వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండో టీ20కి తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం దిశను మార్చుకొని గుజరాత్‌వైపు దూసుకొస్తుందని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఈ నెల 7న సౌరాష్ట్రలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. అయితే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచామని, మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలమని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయ్‌దేవ్ షా తెలిపాడు.

Story first published: Tuesday, November 5, 2019, 17:44 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X