న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువీ ఔట్ కాదు: కాలు క్రీజులోనే ఉంది.. కావాలంటే వీడియో చూడండి

Global T20 Canada 2019 : Yuvraj Singh Walks Off Despite Being Not Out In First Match || Oneindia
Yuvraj Singh walks off despite being not out in Global T20 Canada debut

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో బరిలోకి దిగిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో యువరాజ్ సింగ్ టొరంటో నేషనల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

టోరంటో తరఫున యువరాజ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 27 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్‌గా అయ్యాడు. అయితే, యువరాజ్ ఔట్ అవ్వకపోయినా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చీమా వేసిన 17 ఓవర్‌లో యువరాజ్‌ షాట్‌కు ప్రయత్నించాడు.

కానీ, అది బ్యాట్‌కు తగలకుండా నేరుగా బంతి కీపర్‌ చేతిని తాకి వికెట్లకు తగిలింది. అయితే, ఈ సమయంలో యువరాజ్ కాలు క్రీజ్‌లోనే ఉంది. కానీ, యువీ ఔట్‌గా భావించి అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూడకుండానే మైదానాన్ని వీడాడు. యువరాజ్‌ ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 14 పరుగులు చేశాడు.

కాగా ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్‌పై వాంకోవర్‌ నైట్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువరాజ్ కెప్టెన్‌గా వ్యవహిస్తున్న టోరంటో జట్టులో బ్రెండెన్ మెక్‌కల్లమ్ (4), కీరన్ పొలార్డ్ (30) పరుగులు చేశారు. మెక్‌కల్లమ్, యువరాజ్ విఫలమయినా.. క్లాసేన్ (41), పొలార్డ్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాంకోవర్ నైట్స్‌ 17.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాంకోవర్ కెప్టెన్ క్రిస్ గేల్ (12) నిరాశపరిచినా.. వాల్టన్ (59), దూసేన్ (65) హాఫ్ సెంచరీలతో రాణించడంతో సునాయాస విజయం అందుకుంది. గ్లోబల్ టీ20 కెనడా లీగ్ కారణంగా క్రిస్ గేల్ టీమిండియా పర్యటనకు దూరంగా ఉన్నాడు.

Story first published: Friday, July 26, 2019, 20:09 [IST]
Other articles published on Jul 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X