న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ జట్టులో యువరాజ్ ఆడతాడట!!

Yuvraj Singh Hopeful Of Making 2019 ICC World Cup Squad | Oneindia Telugu
Yuvraj Singh still hopeful of making 2019 ICC World Cup squad

కోల్‌కతా: ఇంగ్లాండ్‌లో నిర్వహించే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా ఆడుతున్నప్పుడే ఆటకు వీడ్కోలు పలకాలని ఆశపడుతున్నట్లు వెల్లడించాడు. బెంగాల్‌ జట్టుతో రంజీ మ్యాచ్ ఆడుతున్న యువీ.. 'క్రికెట్‌ నాకన్నీ ఇచ్చింది. ఆటకు వీడ్కోలు పలికేటప్పుడు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. బాధతో వెళ్లిపోవద్దు' అని తెలిపాడు.

రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతున్నా

రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతున్నా

‘క్రికెట్‌ అన్నీ ఇచ్చింది. ఆటను వీడేటపుడు అత్యుత్తమ దశలో ఉండాలనుకుంటున్నా. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నిష్క్రమించాలి. ప్రస్తుతం రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతున్నా. తర్వాత జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనాలి. ఆపై ఐపీఎల్‌ ఉంది. అన్నింట్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నా' అని యువీ చెప్పాడు. ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న టీమిండియాపై యువీ ప్రశంసలు కురిపించాడు.

రిషభ్‌ పంత్‌ పరుగులు టీమిండియాకు

రిషభ్‌ పంత్‌ పరుగులు టీమిండియాకు

‘టీమిండియా బ్యాటింగ్‌ గతంలో కన్నా మెరుగ్గా ఉంది. ఆటగాళ్లంతా బాగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా పుజారా, కోహ్లీ, బుమ్రా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన వచ్చి రిషభ్‌ పంత్‌ పరుగులు చేయడం టీమిండియాకు బలం. 2003-04లో ఆస్ట్రేలియాలో సిరీస్‌ను డ్రా చేసే అవకాశాలు ఉన్నాయి. 2007-08లో ఆసీస్‌ 2-1తో గెలిచింది. అక్కడ గెలవడం అంటే అంత సులభమేమీ కాదు. రిషభ్‌ గతేడాది టీమిండియాకు ఎంపికైయ్యాడు. ఐపీఎల్‌లో రాణించి టీమిండియాకు ఎంపికైన ఏడాదిలోనే విదేశాల్లో రెండు సెంచరీలు బాదేశాడు' అని యువీ అన్నాడు.

క్యాచ్ వదిలేసిన బాధలో మైదానాన్ని వీడిన విహారీ(వీడియో)

ఫామ్‌ కోల్పోయిన యువీ 2015 ప్రపంచకప్‌కు

ఫామ్‌ కోల్పోయిన యువీ 2015 ప్రపంచకప్‌కు

టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు యువరాజ్‌ సింగ్‌. ఐతే తర్వాత ఫామ్‌ కోల్పోయిన యువీ 2015 ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. అతను భారత జట్టుకు దూరమై ఏడాదిన్నర కావస్తుంది. దేశవాళీల్లోనూ యువీ తగిన స్థాయి ప్రదర్శన చేయకపోవడంతో మళ్లీ అతను టీమిండియాలోకి వచ్చే సూచనలే కనిపించడం లేదు. కానీ అతను మాత్రం ప్రపంచకప్‌లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ప్రపంచకప్‌ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌

ప్రపంచకప్‌ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌

పంజాబ్‌ యువ కెరటం, అండర్-19 సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడని యువీ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో అతడు 7మ్యాచుల్లో 125.80 సగటుతో 629 పరుగులు చేశాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని యువీ పేర్కొన్నాడు. రాణించేందుకు కావాల్సిన విశ్వాసం, ప్రోత్సాహం అందించాలని సూచించాడు. అందుకు రిషభ్‌ పంతే ఉదాహరణ అని చెప్పాడు. పంజాబ్‌ జట్టులో చాలా ప్రతిభ ఉందని చెప్పుకొచ్చాడు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఆడితే ఇంకా మెరుగవుతుందని యువీ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, January 7, 2019, 10:22 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X