Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యాచ్ వదిలేసిన బాధలో మైదానాన్ని వీడిన విహారీ(వీడియో)

When Vihari Nearly Denied Kuldeep a Memorable Fifer at SCG

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత ఫీల్డర్ హనుమ విహారికి చేదు అనుభవం ఎదురైంది. ఫీల్డింగ్‌లో చేసిన పొరబాటు కారణంగా మైదానం వీడి వెళ్లిపోవాల్సి వచ్చింది.
సులువైన క్యాచ్‌ని జారవిడిచి.. జట్టు ఆగ్రహానికి గురైయ్యాడు. ఆఖరి టెస్టు నాలుగోరోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 236/6తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. కుల్దీప్ యాదవ్ (5/99) ధాటికి 265/9తో నిలిచింది. ఈ దశలో హేజిల్‌వుడ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని విహారి తడబాటులో వదిలేశాడు. దీంతో.. ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆస్ట్రేలియా 300 పరుగులు మాత్రమే చేయగలిగింది.

హేజిల్‌వుడ్ ఖాతా తెరవకుండానే

ఇన్నింగ్స్‌ 93వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో.. అప్పుడే క్రీజులోకి వచ్చిన హేజిల్‌వుడ్ కనీసం ఖాతా తెరవకుండానే హిట్టింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి మిడాన్‌లో గాల్లోకి లేచింది. కానీ, ఆ బంతిని అందుకోవడంలో విహారి తడబడటంతో.. చేతిలో పడిన బంతి బౌన్స్ అయ్యి కిందపడిపోయింది. ఒకవేళ అప్పుడే.. హేజిల్‌వుడ్ ఔటై ఉండింటే..? భారత్‌కి 357 పరుగుల ఆధిక్యం లభించేది.

 ఆఖరి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యంతో

ఆఖరి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యంతో

కానీ.. హేజిల్‌వుడ్ (21: 45 బంతుల్లో 2ఫోర్లు), మిచెల్ స్టార్క్ (29 నాటౌట్: 55 బంతుల్లో 3ఫోర్లు) ఆఖరి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. భారత్‌కి 322 పరుగుల ఆధిక్యమే లభించింది.

కుల్దీప్‌తో పాటు కోహ్లీ కూడా మైదానంలోనే

కుల్దీప్‌తో పాటు కోహ్లీ కూడా మైదానంలోనే

హేజిల్‌వుడ్ క్యాచ్ జారవిడచడంతో బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. కొద్దిసేపటి తర్వాత హనుమవిహారి మైదానాన్ని వీడగా.. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా హార్దిక్ పాండ్యా వచ్చాడు. మైదానం నుంచి పెవిలియన్‌‌కి వెళ్లే వరకూ విహారి తలదించుకూనే నడిచాడు.

1
43626
Story first published: Sunday, January 6, 2019, 12:03 [IST]
Other articles published on Jan 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+