న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Yuvraj Singh: రిషభ్ పంత్ టీమిండియా భవిష్యత్తు సారథి.. గిల్‌క్రిస్ట్‌లాంటి గేమ్ చేంజర్!

Yuvraj Singh says Rishabh Pant can be a future India captain

న్యూఢిల్లీ: రిషభ్ పంత్ తనకు టీమిండియా భవిష్యత్తు సారథిలా కనిపిస్తున్నాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. గతంతో పొలిస్తే ఈ యువ వికెట్ కీపర్ చాలా పరిణతి చెందాడని, ఆస్ట్రేలియా దిగ్గజం గిల్‌క్రిస్ట్ తరహాలో మ్యాచ్‌లను ముగిస్తున్నాడని కొనియాడాడు. గిల్ క్రిస్ట్ క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేవాడని, ఇప్పుడు పంత్ అదే తరహాలో చెలరేగుతున్నాడని చెప్పుకొచ్చాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

మ్యాచ్ విన్నర్‌నని..

మ్యాచ్ విన్నర్‌నని..

'గతంతో పోలిస్తే రిషభ్ పంత్‌ మరింత పరిణతి సాధించాడని మీరంతా అంటున్నారు. అందుకు సంతోషం. ఎందుకంటే అతను ఔటైన తీరు చూసి చాలామంది విమర్శించారు. అతని గురించి సానుకూల మాటలు వినడం బాగుంది. అతనొక మ్యాచ్‌ విజేతనని పంత్‌ నిరూపించుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఆడిన తీరు, ఇంగ్లండ్‌తో సెంచరీ చేసిన విధానం గొప్పది. మిడిలార్డర్‌లో అతను అత్యంత కీలకం' అని యువీ అన్నాడు.

గిల్ క్రిస్ట్ తరహాలో..

గిల్ క్రిస్ట్ తరహాలో..

'గిల్‌క్రిస్ట్‌, రిషభ్ పంత్‌ తరహా ఆటగాళ్లు మ్యాచులను క్షణాల్లో మలుపు తిప్పేస్తారు. టెస్టు క్రికెట్లో గిల్లీ క్రీజులోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయేది. ఇప్పుడు రిషభ్ పంత్‌ను చూస్తే అలాగే అనిపిస్తోంది.'అని యూవీ చెప్పుకొచ్చాడు. సిడ్నీలో 118 బంతుల్లో 97, బ్రిస్బేన్‌లో 138 బంతుల్లో 89 నాటౌట్‌తో అజేయంగా నిలవడమే ఉదాహరణ అని వివరించాడు. 'రిషభ్ పంత్‌లో నేను భవిష్యత్తు భారత కెప్టెన్‌ను చూస్తున్నాను. ఎందుకంటే అతను చురుగ్గా ఉంటాడు. అందరితో మాట్లాడుతుంటాడు. మైదానంలో సందడి చేస్తాడు. అంతేకాకుండా అతన్ని తెలివైన బుర్ర. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అతని కెప్టెన్సీ గమనించాను. చాలా చక్కగా రాణించాడు. మున్ముందు అతడిలో భారత కెప్టెన్‌ను చూడొచ్చు' అని యువీ చెప్పుకొచ్చాడు.

లెఫ్ట్, రైట్ కాంబినేషన్..

లెఫ్ట్, రైట్ కాంబినేషన్..

భారత జట్టులో మరో యువరాజ్ ఎవరని ప్రశ్నించగా.. 'వాస్తవానికి మిడిలార్డర్‌లో లెఫ్టాండర్‌ను చూడలేదు. కాకపోతే మంచి హిట్టర్లున్నారు. రిషభ్, హార్దిక్ పాండ్యా రూపంలో మ్యాచ్ విన్నర్లున్నారు. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా మరిన్ని వన్డే, టీ20లు మ్యాచ్‌లు ఆడితే భారత జట్టుకు తిరుగుండదు. ఆ తర్వాత వచ్చే జడేజాతో బ్యాటింగ్ బలం మరింత పెరుగుతోంది. వన్డే, టీ20 క్రికెట్‌లో జడేజా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ప్రత్యర్థులకు ఎప్పటికీ ప్రమాదకరమే. నేను, ధోనీలా.. రిషభ్ పంత్, హార్దిక్, జడేజా 5,6,7 స్థానాల్లో రాణిస్తారనుకుంటున్నా'అని తెలిపాడు.

Story first published: Thursday, July 8, 2021, 19:09 [IST]
Other articles published on Jul 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X