న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతను ‘యూవీ పా’ అన్నప్పుడే రిటైర్ అవ్వాలనుకున్నా: యువరాజ్

Yuvraj Singh Says Decided to retire when Andrew Tye started calling me Yuvi pa

ముంబై: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాతో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ లైవ్ సెషన్‌లో ఈ దిగ్గజ ఆటగాళ్లు క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమ కెరీర్‌కు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. అయితే ఈ ఇన్‌స్టా సంభాషణలో సిక్సర్ల సింగ్ ఐపీఎల్‌కు సంబంధించిన ఓ విషయాన్ని చెప్పి నవ్వులు పూయించాడు.

ఐపీఎల్ 2018 సీజన్‌లో..

ఐపీఎల్ 2018 సీజన్‌లో..

ఐపీఎల్ 2018 సీజన్‌లో యూవీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాడు. ఈ సీజన్‌లో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన ఈ మాజీ ఆల్‌రౌండర్.. 8 మ్యాచ్‌ల్లో కేవలం 65 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఆ సీజన్‌లో పంజాబ్‌కే ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై తనను ‘యూవీ పా'అని పిలిచాడని, ఆ మాట విని తాను ఆశ్చర్యాపోయానని ఈ మాజీ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆటకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని భావించినట్లు గుర్తుచేసుకున్నాడు.

ప్రధాని మోదీని ప్రశంసించిన పాక్ మాజీ పేసర్

ఆశ్చర్యం కలిగించింది..

ఆశ్చర్యం కలిగించింది..

‘వాస్తవానికి మీ(జస్‌ప్రీత్ బుమ్రా) తరంతో ఆడిన తర్వాత ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నా. కానీ 2018లో కింగ్స్ పంజాబ్‌ తరఫున ఆడుతున్న సహచర ఆటగాడు ఆండ్రూ టై నన్ను యూవీ పా అని పిలవడంతో ఇక నాకెరీర్ ముగించాలని డిసైడ్ అయ్యా'అని యూవీ సరదాగా చెప్పుకొచ్చాడు. మాములుగా జూనియర్ ఆటగాళ్లు సీనియర్లను గౌరవంగా పా అని పిలుస్తుంటారు. అయితే తనే వయసే ఉండే ఆండ్రూ టై కూడా యూవీ పా అని పిలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈ సిక్సర్ల సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలకు బుమ్రా పడిపడి నవ్వుకున్నాడు.

2019లో ముంబై జట్టులోకి..

2019లో ముంబై జట్టులోకి..

ఇక 2018 ఫేలవ ప్రదర్శన తర్వాత యూవీ.. 2019 సీజన్‌లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగాడు. బుమ్రాతో కలిసి ఆడాడు. కాకపోతే ఈ సీజన్‌లో యూవీకి పెద్దగా అవకాశాలు దక్కలేదు. కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 98 పరుగులు చేశాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యూవీ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్స్ మాత్రం ఆడుతున్నాడు. అబుదాబి టీ10 లీగ్‌లో మరాఠ అరేబియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ముప్పు తిప్పలు పెట్టిన యూవీ..

ముప్పు తిప్పలు పెట్టిన యూవీ..

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌తో తాను చాలా ఇబ్బంది పడ్డానని యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. అతని బౌలింగ్ ఆడటం చాలా చాలెంజింగ్‌గా ఉండేదన్నాడు. బుమ్రా అత్యుత్తమ పేసర్‌గా ఎదుగుతాడని ఆనాడే చెప్పానని గుర్తు చేశాడు. ఇక ఈ లైవ్ సెషన్‌లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పేరుతో బుమ్రాను ఓ ఆట ఆడుకున్నాడు.

క్లిష్టమైన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రతీ ప్రశ్నకు ఐదు సెకన్ల సమయం మాత్రమే ఇచ్చి ఇబ్బందికి గురిచేశాడు. సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడగిగాడు. యూవీ ప్రశ్నల ధాటికి విలవిలలాడిన బుమ్రా.. ఈ వివాదస్పద ప్రశ్నలేంది బ్రో.. నేను చెప్పలేనంటూ చేతులెత్తేసాడు.

Story first published: Monday, April 27, 2020, 16:58 [IST]
Other articles published on Apr 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X