న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జహీర్, సెహ్వాగ్‌తో పాటు నా పట్ల బీసీసీఐ దారుణంగా వ్యవహరించింది: యువరాజ్

Yuvraj Singh Says BCCI treated me unprofessionally
MS Dhoni & Virat Kohli Are Backstabbed Yuvaraj Singh - Yograj Singh

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌కు అందించిన సేవలకు భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) తమకు కనీస గౌరవం ఇవ్వలేదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు దిగ్గజ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ పట్ల బీసీసీఐ అన్‌ఫ్రొఫెషనల్‌గా వ్యవహరించిందన్నాడు. తమ కోసం ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా ఆడించలేదని అసహనం వ్యక్తం చేశాడు.

అయితే తన విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు తనకేం ఆశ్చర్యం కలిగించలేదని, గతంలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారని తెలిపాడు. ఇక నుంచైనా భారత క్రికెట్‌కు సేవలందించిన ఆటగాళ్లను గౌరవించాలని, వారికి ఘన వీడ్కోలు అందించాలని స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిక్సర్ల సింగ్‌ సూచించాడు.

అవమానపర్చడం అలవాటైంది..

అవమానపర్చడం అలవాటైంది..

‘ఎవరైనా ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతడికి గౌరవంగా వీడ్కోలు పలకడమనేది బీసీసీఐ చేతిలో ఉంటుంది. నా కెరీర్‌ చరమాంకంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు ఏమాత్రం ప్రొఫెషనల్‌గా అనిపించలేదు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి గొప్ప ఆటగాళ్ల‌ని కూడా ఇదే తరహాలో బోర్డు పెద్దలు అవమానించారు. నాకు తెలిసి.. భారత క్రికెట్‌లో ఇలా అవమానకర రీతిలో వీడ్కోలు పలకడం ఓ భాగమైపోయింది.

భవిష్యత్తులోనైనా గౌరవం ఇవ్వాలి..

భవిష్యత్తులోనైనా గౌరవం ఇవ్వాలి..

ఇవన్నీ నేను గతంలోనే చూసి ఉండటంతో.. అవమానకర వీడ్కోలుపై నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. కానీ కనీసం భవిష్యత్తులోనైనా ఇది మారాలి. సుదీర్ఘ కాలం భారత్‌కు ఆడిన ఆటగాళ్లకు కఠిన పరిస్థితుల్లో కూడా తగిన గౌరవం ఇవ్వాలి. భారత్ గెలిచిన రెండు ప్రపంచకప్‌లు గెలిచిన గౌతం గంభీర్, సెహ్వాగ్, టెస్టుల్లో మ్యాచ్ విన్నర్ అయిన సునీల్ గవాస్కర్, 350 వికెట్లు తీసిన జహీర్, అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు ఫ్యూచర్‌లోనైనా ఫెర్‌వెల్ దక్కాలి.'అని యువీ ఆకాంక్షించాడు.

రెండు ప్రపంచకప్‌ల్లో..

రెండు ప్రపంచకప్‌ల్లో..

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. కెరీర్ చరమాంకంలో మాత్రం ఊహించని అవమానాలు ఎదుర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 362 పరుగులు, 15 వికెట్లు పడగొట్టిన యువరాజ్ సింగ్.. క్లిష్ట సమయాల్లోనూ సాహసోపేతంగా పోరాడి టీమిండియాకి విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు.

క్యాన్సర్‌తో..

క్యాన్సర్‌తో..

కానీ.. ఆ వరల్డ్‌కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడిన యువీ.. కొన్నిరోజులు ఆటకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. మునుపటిలా ఆడలేకపోవడంతో అతనికి 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ చోటు దక్కలేదు. అయితే 2017లో సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకున్నా.. గాయాలు యువీ కెరీర్‌ని దెబ్బతీశాయి. ముఖ్యంగా.. టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రవేశపెట్టిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో తొలుత ఫెయిలైన ఈ ఆల్‌రౌండర్.. కొన్ని రోజుల తర్వాత అందులో పాసైనా అప్పటికే ఆలస్యమైపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ టోర్నీ జరుగుతుండగానే యువీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పేశాడు.

Story first published: Monday, July 27, 2020, 13:59 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X