న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్ ఆటతీరు మార్చుకుంటున్నాడు.. కుదురుకొనేందుకు సమయం ఇవ్వాలి'

Rishabh Pant Is Changing His Game,Give Him Some Time Says Yuvaraj Singh
yuvraj-singh-said-rishabh-pant-is-changing-his-game-give-him-some-time


ముంబై: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్ ఇప్పుడిపుడే ఆటతీరు మార్చుకుంటున్నాడు. అతడు కుదురుకొనేందుకు తగినంత సమయం ఇవ్వాలి. యువకులకు అండగా నిలిచి వారిని మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దాలని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సూచించాడు. ఆధునిక క్రికెట్ పరంగా భారత సెలెక్టర్ల ఆలోచన బాగాలేదు. మనకు మంచి సెలక్టర్లు అవసరవమని ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా ఇప్పటికీ డుప్లెసిస్ జట్టే.. నేను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే!!దక్షిణాఫ్రికా ఇప్పటికీ డుప్లెసిస్ జట్టే.. నేను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే!!

అయోమయానికి గురవుతున్నాడు:

అయోమయానికి గురవుతున్నాడు:

తాజాగా యువరాజ్‌ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ... 'పంత్ కొంత అయోమయానికి గురవుతున్నాడు. బంతిని బాదాలో, స్ట్రైక్‌ రొటేట్‌ చేయాలో అతనికి అర్థం కావడం లేదు. బంగ్లాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంతికో పరుగు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బాదేయాలని చూస్తాడు. అయితే ఈసారి క్రీజులో కొంత సమయం ఉండడం శుభపరిణామం. ఇప్పటి వరకు కేవలం 8 నుంచి 10 వన్డేలే ఆడాడు. కాబట్టి పంత్‌కు కాస్త సమయం ఇవ్వాలి. ఆటగాళ్లకు అండగా ఉండాలి' అని యువరాజ్‌ అన్నాడు.

కుదురుకొనేందుకు సమయం ఇవ్వాలి:

కుదురుకొనేందుకు సమయం ఇవ్వాలి:

'విదేశాల్లో 2 శతకాలు, విండీస్‌పై వరుసగా 2 సార్లు 90లు సాధించిన పంత్‌కు ఇటీవలి టెస్టుల్లో అవకాశం ఎందుకివ్వలేదో అర్థం కాలేదు. అతడి కీపింగ్‌లో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమే. మరిన్ని అవకాశాలు ఇచ్చి ఎదుగుదలకు తోడ్పడాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 4, 5 స్థానాల్లో బాగున్నాడు. కానీ.. పంత్ ఓపెనర్‌ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అతడు ఇప్పుడిప్పుడే తన ఆటను మార్చుకుంటున్నాడు. కుదురుకొనేందుకు తగినంత సమయం ఇవ్వాలి' అని యువీ సూచించాడు.

దూబెను నాతో పోల్చడం సారికాదు:

దూబెను నాతో పోల్చడం సారికాదు:

'యువ ఓపెనర్‌ శివమ్‌ దూబెను కెరీర్‌ ఆరంభించనివ్వండి. కెరీర్‌లో అతడో స్థాయికి చేరుకున్న తర్వాత పోల్చడం మొదలు పెట్టండి. అతన్ని నాతో పోలుస్తారని అనుకోను. దూబె మంచి ప్రతిభావంతుడు. సొంతంగా పేరుతెచ్చుకోవాలి. అతడి బ్యాటింగ్‌ శైలిలో కొన్ని మార్పులు అవసరం. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాఠోడ్‌ గాడిలో పెట్టాలి. దూబె పొరపాట్లను కోచ్‌ గుర్తిస్తాడో లేదో చూడాలి. తక్కువ సమయంలోనే ఫలితాలు ఆశించొద్దు' అని యువరాజ్‌ అన్నాడు.

మంచి సెలక్టర్లు అవసరం:

మంచి సెలక్టర్లు అవసరం:

'టీమిండియాకు కచ్చితంగా మంచి సెలక్టర్లు అవసరం. మన సెలక్టర్ల బాధ్యత అంత సులువైనది కాదు. సెలక్టర్లు 15 మందిని ఎంపిక చేసిన తర్వాత ఇతర ఆటగాళ్లను ఎందుకు ఎంపికవ్వలేదని చర్చలు జరుగుతాయి. ఆటగాళ్ల గురించి నెగిటివ్‌గా మాట్లాడితే ఒత్తిడికిలోనై అంతగా రాణించలేరు. ఆటగాళ్లకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. విఫలమైన సమయంలో కూడా అండగా నిలవాలి. ఇతర దేశాల్లో ఆటగాళ్లు ఒత్తిడికిలోనైనా, మానసికంగా బాగా లేకపోయినా వారికి విశ్రాంతి ఇచ్చి తిరిగి జట్టులోకి తీసుకుంటారు. కానీ, మన దేశంలో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది' అని యువరాజ్‌ మండిపడ్డాడు.

Story first published: Tuesday, November 5, 2019, 16:03 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X