న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్యాన్సర్‌ జయించాక.. సచిన్ మాటలే క్రికెట్‌లోకి తిరిగొచ్చేలా చేశాయి: యూవీ

Yuvraj Singh reveals how Sachin Tendulkar inspired his comeback after cancer battle

ముంబై: తాను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక ఏం తోచని స్థితిలో తరచూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడాను అని ప్రపంచకప్‌ల‌ హీరో, భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలిపాడు. ఆ సమయంలో సచిన్ మాటలే తనకు మళ్లీ క్రికెట్ ఆడాలనే ప్రేరణ కలిగించాయని యూవీ తెలిపాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ షోతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అందుకున్నాడు.

క్యాన్సర్‌ జయించాక

క్యాన్సర్‌ జయించాక

2011 వన్డే ప్రపంచకప్‌ అనంతరం యువరాజ్‌ సింగ్‌ క్యాన్సర్‌తో బాధపడ్డాడు. ఆపై అమెరికా వెళ్లి మెరుగైన చికిత్స తీసుకొని దాన్నుంచి కోలుకొని తిరిగి టీమిండియాలో చేరాడు. ఇదే విషయంపై స్పోర్ట్స్‌ కీడాతో ఇటీవల ముచ్చటించిన యువీ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'క్యాన్సర్‌ జయించాక నా కెరీర్‌ ఒడుదొడుకుల్లో పడింది. ఏం తోచని సమయంలో సచిన్‌తో మాట్లాడా. ఆ సంభాషణలో సచిన్ పాజీ కొన్ని ప్రశ్నలు వేశాడు. "మనమెందుకు క్రికెట్‌ ఆడతాం?.. ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడాలనుకుంటాం. క్రికెట్‌ను ప్రేమిస్తే.. నీకు ఆడాలనిపిస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నాకు కూడా ఏం చేయాలో తెలియకపోవచ్చు" అం సచిన్ నాతో అన్నాడు' అని యూవీ తెలిపాడు.

శరీరం మునుపటిలా లేదు

శరీరం మునుపటిలా లేదు

'ఆటమీద నీకు ఇష్టముంటే ఆడుతూనే ఉండు, అలాగే నీకు ఇష్టమొచ్చినప్పుడే రిటైరవ్వు, నీ రిటైర్మెంట్‌ను ఇతరులు నిర్ణయించకూడదని సచిన్ అన్నారు. అలా ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి కలిగించాయి. దాంతో దేశవాళి క్రికెట్‌లో రాణించి మళ్లీ భారత్ తరఫున మూడు, నాలుగేళ్లు క్రికెట్ ఆడాను. నేను కొన్ని అద్భుత ప్రదర్శనలు చేశాను. 2014 టీ20 ప్రపంచకప్‌లో బాగా ఆడడంతో పాటు 2017లో ఇంగ్లండ్‌తో ఆడిన ఒక వన్డేలోనూ కెరీర్‌ అత్యుత్తమ స్కోర్‌ (150) చేశాను. క్యాన్సర్ తర్వాత నా శరీరం మునుపటిలా లేదు' అని యువరాజ్‌ చెప్పాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో యువీ హాఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువరాజ్‌ సింగ్‌ భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ‌బ్రాడ్‌ హవా: మ్యాచ్‌కు ముందు 10.. ఆ తర్వాత 3

Story first published: Wednesday, July 29, 2020, 18:08 [IST]
Other articles published on Jul 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X