న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆశ్చర్యం కలిగించలేదు: తొలి రౌండ్‌లో కోనుగోలు చేయకపోవడంపై యువరాజ్

IPL 2019 : Yuvraj Singh 'Not Surprised' With Round 1 Snub In 2019 Auction | Oneindia Telugu
Yuvraj Singh not surprised with Round 1 snub in 2019 Auction, opens up on poor IPL 11 form with KXIP

హైదరాబాద్: ఐపీఎల్ వేలం తొలి రౌండ్‌లో ప్రాంఛైజీలు కొనుగోలు చేయకపోవడం తనను ఆశ్చర్యం కలిగించలేదని యువరాజ్‌సింగ్‌ అన్నాడు. గత మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో చివరి వరకూ అమ్ముడుపోకుండా ఉన్న టీమిండియా వెటరన్ క్రికెటర్‌ను యువరాజ్‌సింగ్‌ను ముంబై ఇండియన్స్ చివర్లో కనీస ధర రూ.కోటికే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో యువీ పతనం.. రూ.16కోట్ల నుంచి 1 కోటికి జరిగిందిలా!!ఐపీఎల్‌లో యువీ పతనం.. రూ.16కోట్ల నుంచి 1 కోటికి జరిగిందిలా!!

భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన యువరాజ్ సింగ్‌ను తొలి దశలో కనీస ధర రూ.కోటికి కొనడానికి కూడా ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. దీంతో క్రికెట్‌ విశ్లేషకులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకప్పుడు యువరాజ్ వేలంలో ఉన్నాడంటే పోటీపడి కొనుగోలు చేసే పరిస్థితి. 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఏకంగా రూ.16 కోట్లకు సొంతం చేసుకుంది.

యువీ ధర ఏటా దిగజారిపోతూ

యువీ ధర ఏటా దిగజారిపోతూ

అలాంటి ప్రస్తుతం ఐపీఎల్‌లో యువీ ధర ఏటా దిగజారిపోతూ వచ్చింది. అయితే, తాజా వేలంలో తొలి రౌండ్‌లో యువరాజ్‌ను ప్రాంఛైజీలు కోనుగోలు చేయకపోవడంపై యువీ మీడియాతో మాట్లాడుతూ "తొలి దశలో నా పేరు లేనందుకు నేనేం బాధపడలేదు. ఎందుకంటే అందుకు కారణమేంటో నాకు తెలుసు. ఐపీఎల్‌ వేలంలో వివిధ ఫ్రాంఛైజీల చూపంతా యువ క్రికెటర్ల వైపే ఉంటుంది. దూకుడు మీదున్న క్రికెటర్లనే వాళ్లు తొలుత కొనుగోలు చేస్తారు" అని అన్నాడు.

నా కెరీర్‌ తొలి నాళ్లలో ఐపీఎల్‌ వేలంలో

"నాకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. నా కెరీర్‌ తొలి నాళ్లలో ఐపీఎల్‌ వేలంలో నాకు మంచి గుర్తింపు ఉండేది. ఈ ఐపీఎల్‌లో ఏదో ఒక ఫ్రాంఛైంజీ దక్కించుకుంటుందని నేను ముందే ఊహించా. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ జట్టులో నేనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ ఉంటారు. మెంటార్‌గా సచిన్‌, కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉన్నారు. ఈ ముగ్గురితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆకాశ్‌ అంబానీ నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. దానిని నేను నిలబెట్టుకుంటాను" అని అన్నాడు.

 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు

2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు

2011లో పుణె జట్టు 1.8 మిలియన్ డాలర్లు (12.78 కోట్లు)కి యువరాజ్‌ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2014లో ఆర్‌సీబీ రూ.14 కోట్లకి, 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు ధరకు యువీని దక్కించుకున్నాయి. ఆ తర్వాత కొనుగోలు చేసిన ధరకు యువీ సరైన న్యాయం చేయడం లేదని భావించిన ఆయా జట్లు తర్వాత ఏడాది వదిలించుకున్నాయి.

 గత కొంతకాలంగా యువీ ఏ ఫార్మాట్‌లోనూ రాణించకపోవడం

గత కొంతకాలంగా యువీ ఏ ఫార్మాట్‌లోనూ రాణించకపోవడం

2016లో సన్‌రైజర్స్ 7 కోట్లు పెట్టి యువీని కొనుగోలు చేయగా.. 2018లో పంజాబ్ 2 కోట్ల బేస్ ధరకి యువీని దక్కించుకుంది. కొంతకాలంగా యువీ ఏ ఫార్మాట్‌లోనూ రాణించకపోవడం.. ముఖ్యంగా టీమిండియాలో చోటు దక్కించుకోకపోవడం తదితర కారణాలతో 2019 వేలంలో యువీ తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. రెండో రౌండ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి (బేస్ ధర)కి కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ నిర్ణయంపై యువీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Thursday, December 20, 2018, 11:46 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X