న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్‌ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరంటే?!!

Yuvraj Singh names the bowler he had no clue while facing


ముంబై:
తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో చెప్పేసాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్‌. శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో యువరాజ్ చాలా ఇబ్బంది పెట్టాడట. ఈ విషయాన్ని యువీ స్వయంగా తెలిపాడు. మురళీధరన్‌ బౌలింగ్‌లో ఎదురుదాడి చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. యువరాజ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Yuvraj Singh Revealed The Toughest Bowler He Has Ever Faced

కరోనా కోసం ముత్తయ్య మురళీధరన్ భారీ విరాళం.. ఎంతంటే?!!కరోనా కోసం ముత్తయ్య మురళీధరన్ భారీ విరాళం.. ఎంతంటే?!!

మురళీ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డా:

మురళీ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డా:

యువరాజ్ సింగ్ తాజాగా స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. 'మురళీధరన్ బౌలింగ్‌ని ఎదుర్కోనేందుకు నేను చాలా ఇబ్బందిపడ్డాను. అతను విసిరే బంతులకు నావద్ద సమాధానం లేకపోయింది. మురళీధరన్ బౌలింగ్‌ను అడ్డుకోవడం ఎలాగో నాకు సరైన అవగాహన లేకపోయింది. నా ఇబ్బందిని గమనించిన సచిన్ అతని బౌలింగ్‌లో స్వీప్ షాట్స్ ఆడాల్సిందిగా సూచించాడు. ఆ సూచన ఫలితాన్ని ఇచ్చింది' అని యువరాజ్ తెలిపాడు.

మెక్‌గ్రాత్ ఔట్ స్వింగర్స్‌తోనూ:

మెక్‌గ్రాత్ ఔట్ స్వింగర్స్‌తోనూ:

'ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఔట్ స్వింగర్స్‌తోనూ ఇబ్బంది పడ్డాను. అయితే టెస్టుల్లో అతడి బౌలింగ్‌లో ఆడే అవకాశం నాకు చాలా తక్కువగా లభించింది. ఇందులో మాత్రం చాలా అదృష్టవంతుడిని' అని యువరాజ్ వెల్లడించాడు. మురళీధరన్‌ని 37 మ్యాచ్‌ల్లో ఎదుర్కొన్న యువరాజ్.. ఐదు సార్లు అతనికి వికెట్ సమర్పించుకున్నాడు. మురళీ బౌలింగ్‌లో.. వన్డే ఫార్మాట్‌లో యువరాజ్ పరుగుల సగటు 41.20 మాత్రమే. వికెట్ తక్కువసార్లే సమర్పించుకున్నా.. మురళీ బౌలింగ్‌లో ఆడడం మాత్రం యువీకి ఎప్పుడూ సవాలే.

బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కు:

బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కు:

2011 ప్రపంచకప్‌‌లో ఎంఎస్ ధోనీ ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసాడు. ఫైనల్లో మాత్రం ఒక స్థానం ముందుకు వచ్చాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న యువీ ఆరో స్థానంలో వచ్చాడు. దీనికి కారణం మురళీనే. మురళీధరన్‌తో బౌలింగ్ చేయించేలా శ్రీలంక కనిపించడంతో.. స్పిన్ బాగా ఆడగల మహీ ముందుకువచ్చాడు. అప్పట్లో ఈ బ్యాటింగ్‌ మార్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే జట్టు ప్రయోజనాల కోసమే తన బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చుకున్నట్లు ధోనీ చాలా సార్లు వివరణ ఇచ్చాడు.

 304 వన్డేలు.. 8701 పరుగులు:

304 వన్డేలు.. 8701 పరుగులు:

యువ‌రాజ్ గ‌తేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Thursday, April 2, 2020, 13:33 [IST]
Other articles published on Apr 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X