న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్.. నీ సోరకాయ కూడా నీ అంతే ఉంది: యువరాజ్ సింగ్

Yuvraj Singh leaves hilarious comment on Yuzvendra Chahals Instagram post

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చాహల్ షేర్ చేసిన ఓ ఫొటోకు యువీ తనదైన శైలిలో బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం సన్నదమవుతున్న యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఓ ఫన్నీ పోస్ట్‌ను షేర్ చేశాడు. సోరకాయతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యజ్వేంద్ర చాహాల్... ఓ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ కోసం ఇలా ఫోజు ఇచ్చాడు...

నీ సోరకాయ నీ అంతే..

నీ సోరకాయ నీ అంతే..

దీనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫన్నీగా స్పందించాడు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. 'చూస్తుంటే నీ లోకీ (సోరకాయ) కూడా నీ సైజులోనే ఉన్నట్టుంది.'అంటూ నవ్వుతున్నట్టుగా యువీ ఎమోజీ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో చాహల్ 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. యుజ్వేంద్ర చాహాల్, యువరాజ్ సింగ్ మంచి స్నేహితులు. గతంలో ఈ ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ వివాదాలకు కూడా దారి తీసింది.

టీమిండియా భారీ మూల్యం..

టీమిండియా భారీ మూల్యం..

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, ఆ తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. యజ్వేంద్ర చాహాల్ స్థానంలో టీమ్‌కు ఎంపికైన రాహుల్ చాహాల్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా... మిస్టరీ స్పిన్నర్‌గా టీమిండియాలోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి పేలవ ప్రదర్శనతో జట్టుకి దూరమయ్యాడు.

చాహల్ కీలకం..

చాహల్ కీలకం..

దీంతో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్‌లు ఉండడం తప్పనిసరిగా మారింది. అదీకాకుండా ప్రస్తుత సారథి రోహిత్ శర్మకు, యుజ్వేంద్ర చాహాల్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో చాహాల్, టీ20 వరల్డ్ కప్ ఆడాల్సిందేనని రోహిత్ శర్మ పట్టుబట్టి, సెలక్టర్లను ఒప్పించవచ్చని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

14 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్‌ చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు, టైటిల్ ఫైట్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, అండర్ డాగ్స్‌గా బరిలో దిగి ఆరంగ్రేటం సీజన్‌లో టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఈ విజయంతో భారత ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినట్టైంది.

Story first published: Wednesday, June 8, 2022, 10:46 [IST]
Other articles published on Jun 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X