రిటైర్‌మెంట్ తర్వాత కోచ్‌గా కనిపిస్తా: ఇదీ యువీ మనసులో మాట

Posted By: Subhan
 Yuvraj Singh Has Coaching On His Mind After Retirement

హైదరాబాద్: సిక్సర్ల వీరుడు రిటైర్‌మెంట్ గురించి మాట్లాడేదే లేదని అంటున్నాడు. క్రికెట్‌ను తాను ఎంజాయ్ చేస్తున్నానని తనకు ఆడలేను అనిపించినప్పుడు మాత్రమే క్రికెట్ నుంచి తప్పుకుంటానని అన్నాడు. కొద్ది నెలల క్రితం క్యాన్సర్ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న యువరాజ్ చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

యువరాజ్ సింగ్ కాన్సర్ రోగంతో బాధపడుతున్నప్పుడు తను 'యూ వుయ్ కెన్ ఫౌండేషన్' సంస్థతో కాలం గడిపాడట. అక్కడ చిన్న పిల్లలతో, కొత్త జనరేషన్‌తో గడిపిన అనుభవం తనకు చాలా నచ్చిందని పేర్కొన్నాడు. చదువు, క్రీడలు మనిషికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. చదువుకు ఎంత విలువ ఉందో క్రీడలకు అంతే విలువ ఉండాలని పిలుపునిచ్చాడు.

అయితే రిటైర్‌మెంట్ అనంతరం యువరాజ్ సింగ్ ఏం చేస్తాడనే ప్రశ్నకు స్పందించాడు. 'కామెంటేటర్‌గా కొనసాగడం అనే ప్రసక్తే లేదు. నాకు కొత్త జనరేషన్‌తో గడపాలని ఉంది. భారత క్రికెట్ జట్టుతో కలిసి ప్రయాణించాలని ఉంది. అంతేకానీ, భారత జట్టు వీడేదే లేదు. వంద శాతం మైదానంలోనే కాలం గడుపుతానని' పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'ఐపీఎల్‌లో ఇంకో రెండేళ్ల వరకు ఆడతాననే నమ్మకంతో ఉన్నా. మ్యాచ్ చివరి వరకూ వంద శాతం కష్టపడతా. విజయం గెలిచేవరకు నేను రాజీపడననే మనిషిగా ప్రజలకు గుర్తిండిపోవాలి' అని తెలియజేశాడు. బెంగుళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో యువరాజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మధ్యనే జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో యువరాజ్ పరుగులు వరద పారించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 17:35 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి