మళ్లీ ఫెయిలయ్యాడు: యువరాజ్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకమే?

Posted By:

హైదరాబాద్: యో-యో టెస్టు... ప్రస్తుతం భారత క్రికెటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే భారత్ తరుపున బరిలోకి దిగాలంటే ప్రతి ఒక్క ఆటగాడు యో-యో టెస్టులో పాస్ కావాల్సిందే. ఈ మేరకు సెలక్టర్లు, బీసీసీఐ ఆధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

త్వరలో భారత్ పర్యటనకు న్యూజిలాండ్

త్వరలో భారత్ పర్యటనకు న్యూజిలాండ్

ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టీ20 సిరిస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ భారత పర్యటనకు వస్తుంది. ఈ పర్యనటలో భాగంగా కోహ్లీసేనతో న్యూజిలాండ్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తోంది.

జాతీయ క్రికెట్‌ అకాడమీలో యో-యో పరీక్షకు హాజరైన అశ్విన్, యువీ

జాతీయ క్రికెట్‌ అకాడమీలో యో-యో పరీక్షకు హాజరైన అశ్విన్, యువీ

ఈ ఫిట్‌నెస్ పరీక్షల్లో భాగంగా ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రవిచంద్రన్‌ అశ్విన్‌, యువరాజ్‌ సింగ్‌, పుజారాలు మంగళ, బుధ వారాల్లో యో యో పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో అశ్విన్‌ పాస్ కాగా, యువీ మళ్లీ ఫెయిలయ్యాడు. దీంతో కివీస్‌తో సిరీస్‌కు అశ్విన్‌కు మార్గం సుగమం కాగా, యువీ భవిష్యత్‌ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

ఆసీస్‌తో సిరిస్‌కు ముందు కూడా ఇలా

ఆసీస్‌తో సిరిస్‌కు ముందు కూడా ఇలా

ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు కూడా యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో పాటు పలువురు ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించారు. అప్పట్లో ఈ టెస్టులో యువీ, రైనాలు ఫెయిలయ్యారు. దీంతో ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేలు, ప్రస్తుతం జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌కు బీసీసీఐ సెలక్టర్లు వీరిద్దరినీ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

యువరాజ్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకమే?

యువరాజ్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకమే?

ప్రస్తుతం, టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టుని క్రికెటర్లు తప్పక పాస్ కావాల్సిందే. అలాంటి యో-యో టెస్టులో యువీ ఫెయిలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో యువీ ఇక తిరిగి జట్టులోకి వస్తాడా? భారత్ తరుపున ఆడతాడా? అన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

బెంగళూరులోని జాతీయ అకాడమీలో

యో-యో టెస్టును అశ్విన్ పాసయ్యాడు. బెంగళూరులోని జాతీయ అకాడమీలో జరిగిన ఈ పరీక్షలో బీసీసీఐ నిర్దేశించిన మార్క్(16.1 పాయింట్లు సాధించడం)ను అశ్విన్ సాధించాడు. ఈమేరకు యో-యో పరీక్ష పాస్ అయ్యానని అశ్విన్ ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, October 12, 2017, 16:28 [IST]
Other articles published on Oct 12, 2017
Please Wait while comments are loading...
POLLS