న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్ నువ్వు నవ్వకున్నా.. కనీసం నీ ఎమోజీ అయినా నవ్వింది: యువీ

Yuvi hilariously trolls Gautam Gambhir on his latest Instagram post

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కి ముక్కోపి అని అందరికి తెలిసిందే. తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో గంభీర్ మైదానంలో నవ్వుతూ కనిపించిన క్షణాలు చాలా అరుదు. గ్రౌండ్‌లోనే కాకుండా బయట కూడా ఈ బీజేపీ ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. దీంతో అతని సహచర ఆటగాళ్లు కూడా అతనితో సరదాగా ఉండేందుకు జంకేవారు.

ఇక మైదానంలోనైనా.. బయట అయినా తన జోలికి వస్తే మాత్రం గంభీర్ వదిలిపెట్టడు. వారితో ఢీ అంటే ఢీ అన్నట్లు గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో ఓసారి విరాట్ కోహ్లీతో సైతం గొడవ పెట్టుకున్నాడు. ఇక పాక్ మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది‌తోనైతే లెక్కలేనన్ని సార్లు వాగ్వాదానికి దిగాడు. ఇప్పటికీ వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది.

Yuvi hilariously trolls Gautam Gambhir on his latest Instagram post

అలాంటి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘకాలం క్రికెట్ ఆడిన యువరాజ్ సింగ్ జోకులు పేల్చాడు. తాజాగా సోషల్ మీడియాలో తన ఫొటోను షేర్ చేసిన గంభీర్.. ఆ ఫొటోలోని పెదవులను వంచి తీరును వర్ణించాడు. 'ఈ ఫొటోలో నాకు నేను చూసుకుంటే.. ఔట్ స్వింగ్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి నేరుగా స్లిప్‌లోకి వెళ్తున్నట్లు ఉంది'ఫన్నీ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చాడు. ఇక దీనిపై సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ తనదైన శైలిలో స్పందించాడు. 'పోనీలే గంభీర్..కనీసం నీ ఏమోజీ అయినా నవ్వింది'అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ గంభీర్.. ఎన్నికల్లో బరిలోకి దిగి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. వలస కూలీలు, పేదలకి గంభీర్ నిత్యావసరాలు సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

కాస్ట్ కటింగే.. జీతాల్లో కోతల్లేవ్.. బీసీసీఐ క్లారిటీకాస్ట్ కటింగే.. జీతాల్లో కోతల్లేవ్.. బీసీసీఐ క్లారిటీ

Story first published: Sunday, June 7, 2020, 15:51 [IST]
Other articles published on Jun 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X