న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువ పేసర్‌పై రెండేళ్ల నిషేధం!!

Young Bangladesh pacer Kazi Anik Islam handed two-year ban for doping violation

ఢాకా: బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ కాజీ అనిక్‌ ఇస్లామ్‌పై రెండేళ్ల నిషేధం పడింది. డోప్‌ టెస్టులో విఫలం కావడంతో అతనిపై రెండేళ్లు నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018లో నిర్వహించిన డోప్‌ టెస్టులో విఫలం కావడంతో అనిక్‌ ఇస్లామ్‌పై ఎట్టకేలకు నిషేధం పడింది. నిషేధం 2019 ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

2018 అండర్‌-19 ప్రపంచకప్‌‌లో బంగ్లాదేశ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచిన కాజీ అనిక్‌ ఇస్లామ్‌.. అదే ఏడాది నిర్వహించిన డోప్‌ టెస్టులో విఫలయ్యాడు. నిషేధిత ఉత్రేరకం మెథామ్‌ఫిటామైన్‌ను కాజీ తీసుకున్నట్లు రుజువు కావడంతో నిషేధం తప్పలేదు. నిషేదిత ఉత్ప్రేరకాన్ని తీసుకుని తప్పు చేసినట్లు కాజీ అనిక్‌ బీసీబీ పెద్దల ముందు అంగీకరించడంతో.. కేవలం రెండేళ్ల నిషేధంతో సరిపెట్టింది.

'నిషేదిత ఉత్ప్రేరకాన్ని తీసుకుని తప్పు చేసినట్లు కాజీ అనిక్‌ బోర్డు ముందు అంగీకరించాడు. బీసీబీ కాజీ వయసు, సాపేక్ష అనుభవరాహిత్యాన్ని పరిగణించింది. కావాలని ఈ తప్పును చేయలేదని భావించాం. ఎటువంటి విచారణ లేకుండా కాజీ తన తప్పును ఒప్పుకోవడంతో సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేశాడు. దాంతో అతనిపై రెండేళ్ల నిషేధం సరైనది భావించాం' అని బీసీబీ ప్రకటనలో వెల్లడించింది. 21 ఏళ్ల కాజీ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీశాడు.

పంత్‌ను ఒకసారి మందలిస్తేనే మెరుగవుతాడు: ఇర్ఫాన్‌పంత్‌ను ఒకసారి మందలిస్తేనే మెరుగవుతాడు: ఇర్ఫాన్‌

Story first published: Monday, July 27, 2020, 16:02 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X