న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని ఎలా ఔట్‌ చెయ్యాలంటే!: బౌలర్లకు షేన్ వార్న్ సలహా

India Vs Australia 4th ODI : Shane Warne Explains How To Dismiss Virat Kohli | Oneindia Telugu
You cannot bowl at Virat Kohlis stumps: Shane Warne advises bowlers

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగులు చేయకుండా ఎలా అడ్డుకోవాలో చెప్పాడు ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌. కెరీర్ ఆరంభంలో కోహ్లీని ఔట్‌ చేసేందుకు బౌలర్లు అతడి బలహీనతల మీద దృష్టి పెట్టగా కోహ్లీ వాటిని తన ఫిట్‌నెస్ లెవల్స్ పెంచుకోవడంతో పాటు తన టెక్నిక్‌ను మెరుగుపరచుకున్నాడు.

4th ODI Highlights: టర్నర్ విధ్వసం, భారత్ ఓటమి, సిరిస్ 2-2తో సమం4th ODI Highlights: టర్నర్ విధ్వసం, భారత్ ఓటమి, సిరిస్ 2-2తో సమం

దీంతో కోహ్లీని ఎలా ఔట్ చేయాలో తెలియక బౌలర్లు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని అడ్డుకునేందుకు షేన్‌వార్న్‌ ఓ ఉపాయాన్ని వెల్లడించాడు. "ఎవరైనా బౌలర్ కోహ్లీకి బౌలింగ్ చేయాల్సి వస్తే.. నేరుగా లెగ్‌స్టంప్ పైకి బంతి విసిరి ఆన్‌సైడ్‌ను కాపాడుకోవాలి. లేదంటే ఆఫ్‌సైడ్ అవతలికి బంతిని వేసి పూర్తిగా ఆఫ్‌సైడ్ ఆడేలా చేయాలి" అని అన్నాడు.

షాట్ మిస్సయితే ఎక్కడో అక్కడ దొరికిపోతాడు

షాట్ మిస్సయితే ఎక్కడో అక్కడ దొరికిపోతాడు

"అప్పుడు స్లిప్, షార్ట్ కవర్స్ మీదుగా కవర్ డ్రైవ్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. షాట్ మిస్సయితే ఎక్కడో అక్కడ దొరికిపోతాడు. ఒకవేళ వికెట్‌ టు వికెట్‌ బంతిని విసిరితే మాత్రం కోహ్లీ రెండు వైపులా ఆడగలడు. రెండు వైపులా కాకుండా ఏదైనా ఒకవైపు ఫీల్డింగ్‌ సరిచేస్తే సరిపోతుంది. మంచి ఆటగాళ్లకు ఇలాగే బంతులేయాలి" అని క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో వార్న్ అన్నాడు.

నేరుగా బంతులు వేస్తే మాత్రం మూల్యం తప్పదు

నేరుగా బంతులు వేస్తే మాత్రం మూల్యం తప్పదు

ఒకవేళ వికెట్ తీస్తానని నేరుగా బంతులు వేస్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు అని వార్న్ వివరించాడు. "సచిన్, లారా కంటే కోహ్లీ మెరుగైన ఆటగాడు. ఈ ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నా. క్రికెట్‌లో నేను చూసిన అత్యుత్తమ ప్లేయర్ డాన్ బ్రాడ్‌మన్. కానీ అతనితో పోలిక పెట్టలేం. తర్వాత వివ్ రిచర్డ్స్ అత్యుత్తమ ఆటగాడు" అని వార్న్ తెలిపాడు.

నేను ఆడిన వారిలో సచిన్, లారా ఉత్తమం

నేను ఆడిన వారిలో సచిన్, లారా ఉత్తమం

"నేను ఆడిన వారిలో సచిన్, లారా ఉత్తమం. ఇప్పుడు వీళ్లను మించిపోయాడు కోహ్లీ. సెంచరీల పరంగా సచిన్‌కు సమీపంగా వస్తున్నాడు. అయితే రికార్డులను బట్టి అంచనా వేయడం చాలా కష్టమే. వారి హయాంలో వాళ్లు ఎంత బాగా ఆడుతున్నారనే దానిని బట్టి ఉత్తమ ఆటగాళ్లను గుర్తించొచ్చు. ప్రస్తుతమైతే కోహ్లీని మించినొళ్లు లేరు. ఛేదనలో కోహ్లీ కొట్టిన సెంచరీలు చాలు అతని గురించి చెప్పడానికి" అని వార్న్ వ్యాఖ్యానించాడు.

వరుసగా కోహ్లీ రెండు సెంచరీలు

వరుసగా కోహ్లీ రెండు సెంచరీలు

కాగా, 2016 నుంచి ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ 59 ఇన్నింగ్స్‌లో 3985 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతోన్న ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన కోహ్లీ తన కెరీర్‌లో 41వ సెంచరీని నమోదు చేశాడు.

Story first published: Monday, March 11, 2019, 10:15 [IST]
Other articles published on Mar 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X