న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్ నిలబెడితే టీమిండియాను అదుపుచేయలేం'

India vs Australia T20I Series : You Can't Stop Rohit Sharma says Maxwell | Oneindia Telugu
You Cant Stop Rohit Sharma, Says Star Australian Cricketer

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్‌గానే కెప్టెన్‌గానూ ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మ్యాచ్‌లలో అద్భుతమైన ఫామ్ కనబరచిన రోహిత్‌ను సాటి ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాను కోల్పోయిన ఫామ్‌ను తాత్కాలిక కెప్టెన్సీ అప్పగించిన నాటి నుంచి విజృంభించి ఆడుతూ.. తిరిగి రాబట్టుకున్నాడు రోహిత్. ఈ క్రమంలోనే ప్రస్తుత క్రికెట్‌లో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మను ఆపలేమని ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు.

విదేశీ పిచ్‌లపై రోహిత్ ఎదుర్కొనే తీరు

విదేశీ పిచ్‌లపై రోహిత్ ఎదుర్కొనే తీరు

తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసమని ఎంపిక చేసిన భారత జట్టులోనూ రోహిత్ చోటు దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టుల్లోకి రోహిత్‌ రాక.. పర్యాటక భారత జట్టుకు అదనపు బలమవనుందని మ్యాక్స్‌వెల్‌ అభిప్రాయపడ్డాడు. విదేశీ పిచ్‌లపై రోహిత్ బ్యాటింగ్‌ శైలి.. బౌలర్లను ఎదుర్కొనే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుందని వెల్లడించాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో రోహిత్‌ గురించి మ్యాక్స్‌వెల్‌ ఇలా మాట్లాడాడు.

తడబాటు లేకుండా కావాల్సిన రీతిలో స్పందిస్తూ..

తడబాటు లేకుండా కావాల్సిన రీతిలో స్పందిస్తూ..

‘ఎలాంటి శ్రమ లేకుండా రోహిత్‌ చాలా సులభంగా బౌలర్లను ఎదుర్కొంటాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతని సగటు చూస్తేనే అర్థమవుతుంది. అతనెంత గొప్ప ఆటగాడో. బౌలర్‌తో సంబంధం లేకుండా పేస్‌, స్పిన్‌.. ఏదైనా ఒకేలా స్పందిస్తాడు. ఏమాత్రం తడబాటు లేకుండా తనకు కావాల్సిన రీతిలో బంతిని స్టాండ్స్‌లోకి తరలిస్తాడు. దీనికితోడు వన్డేల్లోనూ ఇప్పటికే 3 డబుల్‌ సెంచరీలు సాధించాడు. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తే అతనిని ఆపడమనేది కష్టంతో కూడుకున్న పనే.' అని చెప్పుకొచ్చాడు.

2016 జనవరిలో పెర్త్‌లో 171 పరుగులతో

ఇదిలా ఉండగా ఆసీస్‌ గడ్డపై రోహిత్‌కు 3 ఫార్మాట్‌లలోనూ మంచి సగటుతో మెరుగైన రికార్డే ఉంది. 2016 జనవరిలో పెర్త్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో అతను 171పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇటీవల విండీస్‌తో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ రోహిత్‌ సత్తా చాటి జట్టులో మళ్లీ తనెంత విలువైన ఆటగాడో గుర్తు చేశాడు.

 ఆసీస్‌ సిరీస్‌ రూపంలో అవకాశాన్ని

ఆసీస్‌ సిరీస్‌ రూపంలో అవకాశాన్ని

ఆరంభంలోనే అతను నిలదొక్కుకుంటే స్కోరుబోర్డు పరుగులు పెడుతుందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. మరి ఆసీస్‌ సిరీస్‌ రూపంలో టెస్టుల్లో మరోసారి అందివచ్చిన అవకాశాన్ని మన హిట్‌మ్యాన్‌ వినియోగించుకుంటాడో లేదో చూడాల్సిందే.

Story first published: Sunday, November 18, 2018, 14:19 [IST]
Other articles published on Nov 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X