న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదే నా తొలి ఐపీఎల్‌.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ప్రపంచకప్‌ హీరో

IPL 2020 : Yashasvi Jaiswal Excited To Play With Steve Smith, Ben Stokes & Jos Buttler | Oneindia
Yashasvi Jaiswal excited to share dressing room with Steve Smith, Ben Stokes in IPL 2020

ముంబై: అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో, భారత యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13 సీజన్‌పై కన్నేశాడు. మార్చి 29న ఆరంభం కానున్న 13వ సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జైశ్వాల్‌ చెప్పాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్) తరఫున ఆడటం ఎంతో ఉపయోగం అని అంటున్నాడు. గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.2.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

భారత్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌.. చైనా రెజ్లర్లకు నో ఎంట్రీ!!భారత్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌.. చైనా రెజ్లర్లకు నో ఎంట్రీ!!

ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా:

ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా:

యశస్వి జైశ్వాల్‌ తాజాగా 'ఇండియా టుడే' జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇదే నా తొలి ఐపీఎల్‌. ఎంతో సంతోషంగా ఉన్నా. ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సీజన్‌లో నా శక్తి మేరకు రాణించి మంచి ప్రదర్శన చేస్తా. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడటం నాకు ఎంతో ఉపయోగం. స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ లాంటి ప్రపంచస్థాయి మేటి ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వారితో విలువైన సూచనలు తీసుకోవచ్చు. వారి నుంచి నేర్చుకోడానికి ఆసక్తి ఉన్నా' అని అన్నాడు.

 ఏదీ సులభంగా రాలేదు:

ఏదీ సులభంగా రాలేదు:

ఏదేమైనా బాల్యంలో ఎదురైన కఠిన పరిస్థితులు తనను మానసికంగా బలంగా ఎదగడానికి సహాయపడ్డాయని జైస్వాల్ పేర్కొన్నాడు. 'నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు, పానీ పానిపురిస్‌ను అమ్ముతున్నప్పుడు ఏ విషయం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే.. అప్పుడు ఆ సమయం నాకు ఎంతో అనవసరం. దాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అలా చేయడం మంచిదని నాకు తెలుసు. నేను ఏదీ సులభంగా పొందలేదు. ప్రతిసారీ కష్టపడాల్సి వచ్చింది. కఠిన పరిస్థితులే నన్ను మానసికంగా బలంగా ఎదగడానికి సహాయపడ్డాయి' అని

జైశ్వాల్‌ చెప్పుకొచ్చాడు.

 ప్రపంచకప్‌లో 400 పరుగులు:

ప్రపంచకప్‌లో 400 పరుగులు:

గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీలో యశస్వి జైశ్వాల్‌ కేరళపై డబుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ద్విశతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక ఇటీవల ముగిసిన అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో మొత్తం 400 పరుగులతో' 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా ఎంపికయ్యాడు. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీ (88, 105, 62, 57, 29, 59)లు చేసాడు.

ప్రపంచకప్‌ అవార్డు ముక్కలు:

ప్రపంచకప్‌ అవార్డు ముక్కలు:

ప్రపంచకప్‌ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసినా.. ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో యశస్వి జైశ్వాల్‌ చాలా నిరాశకి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకి లభించిన ట్రోఫీని అతను పగలగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే అతడి ట్రోఫీ రెండు ముక్కలై కనిపించిందట. అయితే ట్రోఫీకి ఏం జరిగిందో మాత్రం అతడికి గుర్తులేదట.

Story first published: Tuesday, February 18, 2020, 11:03 [IST]
Other articles published on Feb 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X