న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీని పక్కన పెడతావా?: హర్మన్‌ ప్రీత్‌పై నెటిజన్ల మండిపాటు

WWT20: Twitterati question Indias decision to bench Mithali Raj as England beat India in semi-final

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20 లీగ్ స్టేజిలో వరుస విజయాలను నమోదు చేసి ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు గ్రూపు దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టీమిండియా గెలిచి సెమీస్‌ చేరుకుంది.

మహిళల వరల్డ్ టీ20: సెమీపైనల్లో చతికిలబడ్డ భారత్, ఇంగ్లాండ్ చేతిలో ఓటమిమహిళల వరల్డ్ టీ20: సెమీపైనల్లో చతికిలబడ్డ భారత్, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీ చేయగా... చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌‌తో జరిగిన రెండో రౌండ్ పోటీలో బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో పాటు మిథాలీ రాజ్ మెరుపు హాఫ్ సెంచరీతో సునాయాస విజయం సాధించింది. ఆ తర్వాత ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మూడు విజయాలతో భారత జట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.

అసహనం వ్యక్తం చేస్తోన్న భారత అభిమానులు

లీగ్ స్టేజిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి గ్రూప్-బీ టాపర్‌గా నిలిచింది. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీపైనల్లో మాత్రం భారత మహిళల జట్టు కనీసం పోరాటపటిమను కూడా ​ప్రదర్శించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

మిథాలీ రాజ్‌ను ఈ మ్యాచ్‌లో పక్కనబెట్టడంపై

ముఖ్యంగా సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను ఈ మ్యాచ్‌లో పక్కనబెట్టడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మిథాలీ రాజ్‌ని రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయం కారణంగానే మ్యాచ్‌ చేజారిందని సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత మహిళల జట్టు ఎనిమిద వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ స్కివ‌ర్ (52), జోన్స్ (53) హాఫ్ సెంచరీలతో చెలరగడంతో మరో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించారు.

ఐసీసీ

ఐసీసీ మహిళల వరల్డ్ టీ20 పైనల్‌కు చేరిన ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ తన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపింది.

Story first published: Friday, November 23, 2018, 11:15 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X