WTC Final: భారత తుది జట్టులో మన హైదరాబాదీ.. అతని కోసం ఆ సీనియర్ పేసర్ బలి!

WTC Final : Mohammed Siraj In Playing XI |Ishant, Shami, Bumrah ? | Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్ డౌన్‌ మొదలైంది. మరో 8 రోజుల్లో ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్‌పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫస్ట్ ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడంతో ఈ మెగా పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాయి. సౌతాంప్టన్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బబుల్‌లో టీమిండియా సన్నదమవుతుండగా.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌తో కివీస్ సమాయత్తం అవుతుంది.

సిరాజ్‌ను ఇరికించేందుకు..

సిరాజ్‌ను ఇరికించేందుకు..

కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం సాఫ్ట్ క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా బుధవారమే మైదానంలోకి అడుగుపెట్టింది. మెగా పోరుకు ముందున్న 8 రోజులే కోహ్లీసేన ప్రాక్టీస్ చేయనుంది. ప్రస్తుతం వార్మప్‌కు మాత్రమే పరిమితవ్వగా.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. ఆటగాళ్లు రెండు, మూడు గ్రూప్‌లుగా విడిపోయి సాధన చేయనున్నారు.

అయితే ఈ ఎనిమిదిరోజులు జట్టులోని ఫాస్ట్ బౌలర్లకు ఆడిషన్స్ కానున్నాయి. మహ్మద్ సిరాజ్‌ను ఆడించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అదంతా సులువయ్యేలా లేదు. బౌలర్ల ఎంపిక టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. 2019లోని వెస్టిండీస్ పర్యటన తర్వాత తొలిసారి సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు అందుబాటులోకి వచ్చారు. గత మూడేళ్లుగా ఈ త్రయం విదేశీ గడ్డపై దుమ్మురేపింది. సూపర్ బౌలింగ్‌తో భారత సాధించిన అద్భుత విజయాల్లో కీలకపాత్ర పోషించింది.

ఇషాంత్‌పై వేటు..

ఇషాంత్‌పై వేటు..

అయితే ఇటీవల అద్భుత ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ గల్లీ బాయ్ సిరాజ్‌ను జట్టులో ఇరికించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్.. సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మను పక్కనపెట్టాలనుకుంటుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో సిరాజ్ అంచనాలను అందుకుంటే లంబూ బెంచ్‌కు పరిమితమవ్వక తప్పేలా లేదు. సిరాజ్ అయితే లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేయగలడని, అంతేకాకుండా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోవడానికి డెక్, బౌన్సర్లు వేయగల సామర్థ్యం ఈ హైదరాబాదీకి ఉందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక 101 టెస్ట్‌‌లు ఆడిన ఇషాంత్‌కు ఇంగ్లండ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటం సానుకూలంశం. కానీ ఇషాంత్ ఫిట్‌నెస్, వయసుపై టీమ్‌మేనేజ్‌మెంట్ ఆందోళనగా ఉంది.

వయసు, ఫిట్‌నెస్..

వయసు, ఫిట్‌నెస్..

ఇటీవలే సివియర్ మడమ గాయం నుంచి కోలుకున్న 33 ఏళ్ల ఇషాంత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా పెద్దగా ఆడింది లేదు. ఈ పరిస్థితుల్లో అతను మళ్లీ గాయపడ్డా? లేక ఫిట్‌నెస్ సమస్యలతో బౌలింగ్ చేయకపోయినా పరిస్థితి ఏంటనే ఆందోళన టీమిండియాను వెంటాడుతుంది. అతను లాంగ్ స్పెల్ వేయగలడా? ఖచ్చితమైన బౌన్సర్ల‌ సంధించగలడా? అనే సందేహాల మధ్య సిరాజ్‌ను లంబూ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. మరోవైపు అదనపు పేసర్‌తో బరిలోకి దిగుదామంటే.. బ్యాటింగ్ డెప్త్ మిస్సయ్యేలా ఉంది.

పేస్‌కే అనుకూలం..

పేస్‌కే అనుకూలం..

ఆ కారణంగానే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ స్పిన్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పుడు భారత్ పేసర్లు ఓవర్‌సీస్‌లో 2018 నుంచి 20 వికెట్లు పడగొట్టారు. సౌతాంప్టన్ పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉండనున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. గత రెండు పర్యటనలో భారత్.. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ చేతిలో ఈ పిచ్‌పై ఇబ్బంది పడినా.. ఆ మ్యాచ్‌లో లేట్ సమ్మర్‌లో జరిగాయి. అప్పుడు పిచ్‌లు పూర్తి డ్రైగా ఉంటాయి. కానీ ఇప్పుడు సమ్మర్ ప్రారంభంలోనే కావడంతో ఈ పిచ్‌పై సీమర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది విశ్లేకుల మాట!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 10, 2021, 14:25 [IST]
Other articles published on Jun 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X