న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC FINAL 2021:టీ బ్రేక్..నిలకడగా ఆడుతున్న కివీస్!వికెట్ల కోసం ఎదురు చూస్తున్న భారత్‌!

WTC Final Day 3 Session 2 Review: Devon Conway, Tom Latham unbeaten at Tea break

సౌథాంప్టన్‌: భారత్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. మూడో రోజైన ఆదివారం రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లు ఆడి.. వికెట్ కోల్పోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (17; 70 బంతుల్లో 1x4), డెవాన్‌ కాన్వే(18; 56 బంతుల్లో 3x4)లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ జోడీని విడదీసేందుకు టీమిండియా పేసర్లు అష్టకష్టాలు పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే కివీస్ ఇంకా 181 పరుగులు వెనకబడి ఉంది.

టీమిండియా తడబడిన సౌథాంప్టన్‌ పిచ్‌పై టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వేలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆచితూచి ఆడుతూ బ్యాటింగ్‌ చేస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్లు కాపాడుకుంటున్నారు. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ.. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు పంపిస్తున్నారు. దీంతో మంచి భాగస్వామ్యంపై కన్నేశారు. ఇక భారత్ తొలి వికెట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇషాంత్‌, బుమ్రా, షమీ, అశ్విన్‌ పరుగులెక్కువ ఇవ్వకపోయినా.. వికెట్లు తీయలేకపోతున్నారు. ఇక మూడో సెషన్‌లోనైనా కివీస్‌ వికెట్లు తీస్తారేమో చూడాలి.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. వర్షం కారణంగా ఆదివారం మూడో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా.. భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగింది. మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. జేమీసన్‌తో పాటు వాగ్నర్‌, బౌల్ట్‌ సైతం భారత బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. దాంతో కోహ్లీసేన 217 పరుగులకే ఆలౌట్ అయింది. జేమీసన్‌ 5/31, నీల్‌ వాగ్నర్‌ 2/40, బౌల్ట్‌ 2/47 మెరుగైన ప్రదర్శన చేశారు.

145 బంతుల్లో ఒక్క బౌండరీ లేదు.. టెస్ట్ క్రికెట్‌ అంటే ఏంటో చూపించిన నయా వాల్!!145 బంతుల్లో ఒక్క బౌండరీ లేదు.. టెస్ట్ క్రికెట్‌ అంటే ఏంటో చూపించిన నయా వాల్!!

Story first published: Sunday, June 20, 2021, 20:57 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X