న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2021కు వర్ష గండం.. అరంగేట్ర టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతేనా!!

WTC Final 2021 Weather Report: Will Rain Spoil India vs New Zealand Match
WTC Final: Bad News ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం Rain Will Spoil Match ? || Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కౌంట్ డౌన్‌ మొదలైంది. శుక్రవారం ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్‌ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కఠిన పరిస్థితులలో మ్యాచ్ చూద్దామని ఆశించిన అభిమానులకు ఓ చేదువార్త.

<strong>Deccan Chargers కేసులో బీసీసీఐకి భారీ ఊరట!!</strong>Deccan Chargers కేసులో బీసీసీఐకి భారీ ఊరట!!

ఫైనల్‌కు వర్ష గడం:

ఫైనల్‌కు వర్ష గడం:

సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గడం పొంచివుంది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఇంగ్లండ్ వాతావరణ శాఖ, అక్కడి వెబ్‌సైట్లు ఈ విషయాన్నే చెపుతున్నాయి. దాదాపు 80% వర్షం కురుస్తుందని వెల్లడించాయి. జూన్ 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. రెండూ అత్యుత్తమ జట్లే కావడంతో పోరు రసవత్తరంగా సాగుతుందని అందరూ భావిస్తున్నారు. రిజర్వు డే ఉందని సంతోషించినా.. ఇప్పుడు ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం ఉందని తెలియడంతో నిరాశకు గురవుతున్నారు.

సంయుక్త విజేత:

సంయుక్త విజేత:

ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పొంచివున్న వర్ష గండంపై ఓ ట్వీట్‌ చేశారు. జూన్‌ 18 నుంచి 23 వరకు సౌథాంప్టన్‌ వాతావరణం ఎలా ఉంటుందో వివరాలు పోస్ట్‌ చేశారు. ఫైనల్ మ్యాచుకు ఒకరోజు ముందే వర్షం మొదలవుతుందన్నది పనేసర్‌ పేర్కొన్నారు. ఇదే నిజమయితే మ్యాచ్ సజావుగా జరగడం అసాధ్యమే. మ్యాచుకు వర్షం అంతరాయం కలిగిస్తే.. భారత్‌, న్యూజిలాండ్‌ను ఐసీసీ సంయుక్త విజేతగా ప్రకటిస్తుంది.

కివీస్‌కు టై గండాలు:

కివీస్‌కు టై గండాలు:

వర్షం పడి చల్లని వాతావరణ ఉంటే మాత్రం కివీస్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే న్యూజిలాండ్‌ ఐసీసీ టోర్నీల్లో టై గండాలు ఎదుర్కొంటోంది. 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మ్యాచులో సూపర్‌ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ప్రపంచకప్‌ ట్రోఫీ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సంయుక్త విజేతగా ప్రకటించడం ఆ జట్టుకు ఊరట కలిగించేదే.

భారత్-న్యూజిలాండ్‌ జట్లు ఇవే:

భారత్-న్యూజిలాండ్‌ జట్లు ఇవే:

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), సాహా(కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

కివీస్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డేవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మాట్ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌.

Story first published: Wednesday, June 16, 2021, 13:49 [IST]
Other articles published on Jun 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X