న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టవల్ చుట్టుకుని ఫీల్డింగ్ చేసిన భారత స్టార్ బౌలర్.. లేడీ ఫ్యాన్ రియాక్షన్ ఎలాఉందో చూడండి (వీడియో)!

WTC Final 2021: Mohammed Shami wears a towel while fielding in Day 5

సౌథాంప్ట‌న్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆరో రోజుకు చేరుకుంది. వర్షం కారణంగా ఐదు రోజుల్లో పూర్తి ఆట సాధ్యం కాలేదు. దాంతో ముందే ప్రకటించిన 'రిజర్వు డే'ను ఈరోజు వినియోగిస్తున్నారు. భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తొలి ఛాంపియన్‌షిప్‌ టైటిల్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. దొరికిన సమయంలోనే ఆధిపత్యం చెలాయించేందుకు ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఐదవ రోజు ఆట రసవత్తరంగా సాగడంతో అభిమానులు ఆసక్తిగా మ్యాచ్ తిలకించారు. ఇక మైదానంలోని ఫాన్స్ ఒక్క బంతి కూడా మిస్ కాలేదు. అయితే టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కాసేపు మైదానంలోని అభిమానులను తన చిలిపి చేష్టలతో అలరించాడు.

WTC Final: అయ్యో బుమ్రా.. ఏది వేసుకోవాలో కూడా తెలియదా?WTC Final: అయ్యో బుమ్రా.. ఏది వేసుకోవాలో కూడా తెలియదా?

టవల్ చుట్టుకుని ఫీల్డింగ్:

ఐదవ రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. తన బౌలింగ్ పూర్తయిన తర్వాత మొహ్మద్ షమీ ఫీల్డింగ్ కోసం బౌండరీ లైన్ వద్దకు వెళ్లాడు. భారత రిజర్వ్ బెంచ్ క్రికెటర్ నుంచి వాటర్ తీసుకుని తాగిన షమీ.. అనంతరం టవల్ తీసుకుని చెమటను తుడుచుకున్నాడు. ఆపై టవల్‌ను తన నడుంకి చుట్టుకున్నాడు. అది సరిగ్గా లేకపోవడంతో.. మరోసారి తీసి చుట్టుకున్నాడు. ఆ సమయంలో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేయగా.. క్రీజులోని కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ చేశాడు. విలియమ్సన్ పూర్తిగా డిఫెన్స్ ఆడడంతో.. షమీ టవల్ చుట్టుకుని కాసేపు ఫీల్డింగ్ చేశాడు.

 తెగ నవ్వుకున్న ఫాన్స్:

తెగ నవ్వుకున్న ఫాన్స్:

మొహ్మద్ షమీ టవల్ చుట్టుకుని ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. మైదానంలో అతడి వెనకాల ఉన్న ఫాన్స్ తెగ నవ్వుకున్నారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. హగ్ ఇచ్చినట్టు సంబరపడి మురిసిపోయింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సౌథాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉండటంతో షమీ టవల్ చుట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు వేసిన షమీ.. 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రాస్ టేలర్ (11), వాల్టింగ్ (1), కొలిన్ గ్రాండ్‌హోమ్‌ (13), కైల్‌ జెమీసన్‌ (21)లను ఔట్‌ చేశాడు. షమీ దెబ్బకు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకి ఆలౌటైంది.

ఐదు వికెట్లు తీయనందుకు బాదేమిలేదు:

ఐదు వికెట్లు తీయనందుకు బాదేమిలేదు:

ఐదో రోజు ఆట ముగిశాక మొహ్మద్ షమీ మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా తనకిచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని పేర్కొన్నాడు. కెప్టెన్‌ ఏం కోరుకుంటాడో తనకు తెలుసని, అతడి ఆదేశాలు అనుసరిస్తానని వెల్లడించాడు. తానెప్పుడూ దూకుడుగా బంతులేసి వికెట్లు తీసే బౌలరేనని చెప్పాడు. ఐదు వికెట్లు తీయనందుకు తనకేమీ బాధలేదన్నాడు. టీమిండియాకు ఆడుతున్నప్పుడు అలాంటివేమీ ఉండవని, వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోకూడదన్నాడు.

అత్య‌ధికంగా 98 ఓవ‌ర్లు:

అత్య‌ధికంగా 98 ఓవ‌ర్లు:

రెండు రోజులు పూర్తిగా వ‌ర్షం వ‌ల్ల ఆట‌ను కోల్పోవ‌డంతో ఇవాళ అత్య‌ధికంగా 98 ఓవ‌ర్లు వేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే రెండ‌వ ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌ కూడా గెలిచే ఛాన్సు ఉంది. నిజానికి న్యూజిలాండ్‌కే విజ‌యావ‌కాశాలు అధికంగా ఉన్నాయి. రిజ‌ర్వ్ డే రోజున ఒక‌వేళ టీమిండియాను త్వ‌ర‌గా ఔట్ చేస్తే, టార్గెట్‌ను చేజ్ చేసేందుకు వాళ్ల‌కు కావాల్సిన స‌మ‌యం ఉంటుంది. ఇక కోహ్లీసేన దూకుడుగా బ్యాటింగ్ చేసి డిక్లేర్ చేస్తే.. అప్పుడు కివీస్‌ను వేగంగా ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, June 23, 2021, 15:41 [IST]
Other articles published on Jun 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X