న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీ కోసం లారా, జీవితం కోసమైతే సచినే..: ‘నో స్పిన్‌’లో వార్న్‌

Would choose Tendulkar over Lara to bat for my life, says Warne

హైదరాబాద్: తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఎవరినైనా బ్యాటింగ్‌కు పంపాల్సి వస్తే తాను భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ఆశ్రయిస్తానని ఆస్ట్రేలియా స్పిన్‌ లెజెండ్ షేన్‌వార్న్‌ అన్నాడు. ఆత్మకథ 'నో స్పిన్‌'లో షేన్‌వార్న్‌ క్రికెట్లో మధుర స్మృతులను అభిమానులతో పంచుకున్నాడు.

<strong>అప్పట్లో నాకు లంచమివ్వజూపారు: షేన్ వార్న్</strong>అప్పట్లో నాకు లంచమివ్వజూపారు: షేన్ వార్న్

సచిన్‌ టెండూల్కర్, బ్రయాన్‌ లారాల్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరు అన్న ప్రశ్నకు వార్న్ తనదైన శైలిలో స్పందించాడు. 1998లో షార్జా ముక్కోణపు టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుపై సచిన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో షేన్ వార్న్ కూడా ఓ బాధితుడు.

ఈ టోర్నీ అనంతరం సచిన్‌ను తలచుకోగానే తనకు పీడకలలు వచ్చేవని షేన్ వార్న్ చెప్పడం గమనార్హం. అయితే, కొన్నేళ్ల తర్వాత తాను ఏదో సరదాగా అలా అన్నానని మాట మార్చాడు. తాజాగా తన తరంలో సచిన్‌, లారాల్లో ఎవరు ఉత్తమ బ్యాట్స్‌మన్‌ అన్న విషయంపై షేన్ వార్న్ మాట్లాడాడు.

నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమ సచినే

నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమ సచినే

"సచిన్‌, లారాలే ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరిలో టెస్టు సిరీస్‌ ఆఖరి రోజు సెంచరీ చేయడం కోసం ఎవరినైనా బ్యాటింగ్‌ పంపాలనుకుంటే ముందు లారాను ఎంచుకుంటా. అయితే, నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఎవరినైనా బ్యాటింగ్‌ పంపాల్సివస్తే మాత్రం నేను సచిన్‌నే నమ్ముకుంటా. అతడో అద్భుత బ్యాట్స్‌మన్‌" అని అన్నాడు.

చీకటి కోణాలను కూడా అభిమానులతో

చీకటి కోణాలను కూడా అభిమానులతో

దీంతో పాటు క్రికెట్లో కొన్ని చీకటి కోణాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు మాజీ క్రికెటర్‌ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించిన విషయాన్ని వార్న్‌ వెల్లడించాడు. ప్రధానంగా క్రికెటర్లతో ఉన్న రిలేషన్‌షిప్స్‌తో పాటు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గురించి పేర్కొన్నాడు.

ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా వివరించా

ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా వివరించా

"నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, క్రికెట్‌ జీవితంలో జరిగినవాటిని పూర్తి నిజాయితీగా పుస్తకంలో పేర్కొన్నా. ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా వివరించాను. ప్రత్యేకంగా ఐపీఎల్‌ 2008 ఎడిషన్‌ గురించి. ఆ టోర్నీలో సలీం మాలిక్‌ నాకు 2 లక్షల డాలర్లు ప్రతిపాదించాడు. బంతిని నేను వైడ్‌ వేయడం వల్ల మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే అరగంటలో నా గదిలో 2 లక్షల డాలర్లు ఉంటాయని మాలిక్‌ చెప్పాడు" అని వార్న్ అందులో రాసుకొచ్చాడు.

ఓసారి కాసినోలో 5000 డాలర్లు నష్టపోయా

ఓసారి కాసినోలో 5000 డాలర్లు నష్టపోయా

శ్రీలంకలో కూడా ఓసారి మార్క్‌ వా స్నేహితుడు డబ్బు ఆశజూపాడు. ఓసారి కాసినోలో 5000 డాలర్లు నష్టపోయాను. అప్పుడు మార్క్‌వా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి.. ‘ఇదిగో 5000 డాలర్లు తీసుకో అన్నాడు'. నేను వద్దాన్నా వినలేదు. ఎలాంటి ఇబ్బంది లేదు.. ఎవరికీ తెలియదు అంటూ తన ప్రణాళికలు చెప్పే ప్రయత్నం చేశాడు'' అని వార్న్‌ వివరించాడు.

సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం

సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం

ఇదిలా ఉంచితే, తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వార్న్‌ వివరించాడు. ‘నా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలంటే సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం ఒకటైతే, అటు తర్వాత ఎలిజిబెత్‌ హర్లీతో తెగతెంపులు. ఈ రెండే నా వివాహ జీవితంలో చవిచూసిన చేదు జ్ఞాపకాలు. వారితో విడిపోయినప్పటికీ ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నాం' అని వార్న్‌ పేర్కొన్నాడు.

Story first published: Thursday, October 11, 2018, 12:41 [IST]
Other articles published on Oct 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X