న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ! అబుదాబి T10లో భారత క్రికెటర్లు!

Would be great to see Indian players in Abu Dhabi T10: Zaheer Khan

హైదరాబాద్: అబుదాబి వేదికగా జరగనున్న టీ10 లీగ్‌లో పలువురు భారత క్రికెటర్లు ఆడటం బాగుందని టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లు పుట్టుకొస్తోన్న తరుణంలో ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడేందుకు వెసులుబాటు కలిగింది.

ఇటీవలే ముగిసిన కెనడా టీ20 లీగ్‌లో యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. నవంబర్ 14 నుంచి అబుదాబి వేదికగా జరగనున్న టీ10 లీగ్‌లో ఇప్పుడు జహీర్ ఖాన్ ఆడనున్నాడు. నిజానికి భారత ఆటగాళ్లను ఐపీఎల్‌లో తప్పించి మిగతా లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమితివ్వడం లేదు.

టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ: సఫారీలతో టెస్టు సిరిస్‌ నుంచి బుమ్రా ఔట్టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ: సఫారీలతో టెస్టు సిరిస్‌ నుంచి బుమ్రా ఔట్

ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ మాట్లాడుతూ "ఇది పూర్తిగా ప్లేయర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అబుదాబి టి10 కోసం మొత్తం ఆర్గనైజింగ్ బృందంతో పాటు నా జట్టు యజమానులు నాకు చాలా సహాయంగా ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో పాల్గొనేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. అబుదాబి టీ10లీగ్‌లో మరింత మంది భారత ఆటగాళ్లు పాలు పంచుకుంటే బాగుంటుంది" అని అన్నాడు.

టీ10 లీగ్‌లో మ్యాచ్ కేవలం 90 నిమిషాల్లోనే ముగుస్తుంది. దీనిపై జహీర్ ఖాన్‌ను అభిప్రాయం అడగ్గా "అబుదాబి టీ10లీగ్ అనేది ఓ అద్భుతమైన ఫార్మాట్. ఈ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. గతేడాది ఈ టోర్నీలో నేను భాగస్వామిగా ఉన్నా. అప్పుడే తెలిసింది ఈ టోర్నీ యొక్క సత్తా. రాబోయే సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని జహీర్ తెలిపాడు.

రాబోయే రోజుల్లో క్రికెట్‌లో టీ10 అనేది ఒక పెద్ద స్టెప్ అని జహీర్ ఖాన్ కొనియాడాడు. అంతకుముందు, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ లీగ్‌లలోని యువ ఆటగాళ్ల భారత ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌లను పంచుకుంటే అది వారికి నేర్చుకునేందుకు ఒక గొప్ప అనుభవమవుతుందని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 24, 2019, 18:27 [IST]
Other articles published on Sep 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X