న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న తొలి మ్యాచ్ ఏదో తెలుసా?

World’s largest cricket stadium to be inaugurated in India; World XI vs India T20 likely to be the first game

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని త్వరలో భారతదేశంలో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు అతి సమీపంలోని మొతేరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియ నిర్మాణం వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ స్టేడియంలో తొలి మ్యాచ్‌ని నిర్వహించేందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ ఎలెవన్ vs ఇండియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఉంది.

ఎమ్మెస్కే ప్రసాద్ మనోగతం: ధోనీని సెలక్టర్లు ఫేర్‌వెల్ సిరిస్‌కే ఎంపిక చేస్తారా?ఎమ్మెస్కే ప్రసాద్ మనోగతం: ధోనీని సెలక్టర్లు ఫేర్‌వెల్ సిరిస్‌కే ఎంపిక చేస్తారా?

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఈ స్టేడియం కెపాసిటీ 100,024. ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియాల్లో 10వ స్థానంలో ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 1956 సమ్మర్ ఒలింపిక్స్‌తో పాటు 2006లో కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 1992, 2015లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది.

2018 జనవరిలో శంకుస్థాపన

2018 జనవరిలో శంకుస్థాపన

మొతెరాలో ఉన్న స్టేడియాన్ని తొల‌గించి, అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి 2018 జనవరిలో శంకుస్థాపన జరిగింది. మొతేరాలోని 63 ఎకరాల్లో ఈ స్టేడియం విస్తరించి ఉంది. ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్చిటెక్చర్ సంస్థ పాపులస్ డిజైన్ చేసింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది.

మెల్‌బోర్న్ స్టేడియాన్ని నిర్మించిన పాపుల‌స్

మెల్‌బోర్న్ స్టేడియాన్ని నిర్మించిన పాపుల‌స్

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) నిర్మించింది కూడా పాపుల‌స్ సంస్థే. ఈ స్టేడియం నిర్మాణానికి 700 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. ప్ర‌స్తుతం స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చును గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ భ‌రిస్తోంది. మొతెరా స్టేడియం అందుబాటులోకి వ‌స్తే.. మెల్‌బోర్న్ రికార్డును అధిగ‌మిస్తుంది.

మొత్తం 63 ఎకరాల స్థలంలో

మొత్తం 63 ఎకరాల స్థలంలో

మొత్తం 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తోన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు. ఈ స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, మూడు ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్‌తో పాటు 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి.

ప్రత్యేకంగా కార్పొరేట్ బాక్సులు

ప్రత్యేకంగా కార్పొరేట్ బాక్సులు

పెద్ద సంఖ్య‌లో కార్పొరేట్ బాక్సులు ఉన్న స్టేడియం ప్ర‌పంచంలో ఎక్క‌డా లేక‌పోవ‌డం గ‌మనార్హం. మ్యాచ్‌ల‌ను తిల‌కించ‌డానికి వ‌చ్చే కార్పొరేట్ సంస్థ‌ల య‌జ‌మానులు, ఆయా సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా ఛార్జీల‌ను వ‌సూలు చేసి, ఈ బాక్సుల‌ను అప్ప‌గిస్తారు. ఈ రూపంలో భారీగా ఛార్జీల‌ను వ‌సూలు చేసే అవకాశం గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్‌కు లభించింది.

ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ

ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ

ఇందులోనే ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. వీటితో పాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులు... స్క్వాష్ ఎరీనా, టెన్నిస్ ఎరీనా, 3డీ ప్రొజెక్టర్ థియేటర్ అదనం. ల‌క్ష‌ మంది ఒకేసారి ఈ స్టేడియానికి చేరుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ పూర్తి చేస్తోంది.

స్టేడియానికి 300 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్

స్టేడియానికి 300 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్

అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల స‌హ‌కారంతో రోడ్ల విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టింది. రోడ్ల విస్త‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యం, న‌ష్ట ప‌రిహారం చెల్లింపుల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌నే భ‌రిస్తోంది. స్టేడియానికి 300 మీటర్ల

దూరంలో మెట్రో స్టేషన్ ఉంది. ల‌క్ష‌మంది ఒకేసారి స్టేడియానికి త‌ర‌లి రావ‌డం అంటూ జ‌రిగితే పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

పాతిక ఎక‌రాల‌ు పార్కింగ్ కోసమే

పాతిక ఎక‌రాల‌ు పార్కింగ్ కోసమే

దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల పార్కింగ్ స్థ‌లం కోసం పాతిక ఎక‌రాల‌ను కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. ఒకేసారి 15 వేల వాహ‌నాల‌ను ఇక్క‌డ నిలిపి ఉంచే అవ‌కాశాలను క‌ల్పిస్తోంది గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్. మూడు వేలకు పైగా కార్లు, 10 వేలకు పైగా ద్విచ‌క్ర వాహ‌నాల‌ను పార్క్ చేయ‌డానికి వీలుగా పార్కింగ్ స్థ‌లాన్ని తీర్చిదిద్దుతున్నారు.

జనవరి 2020 నాటికి అందుబాటులోకి

ఈ స్టేడియంలో ప్లడ్ లైట్లకు బదులు అంతటా ఎల్‌ఈడీ లైట్లు వెలుగులు అందించనున్నాయి. ఈ స్టేడియంలో సోలార్ పవర్ జనరేషన్‌తో పాటు 65 వర్షపు నీటి గుంతలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తైంది. జనవరి 2020 కల్లా స్టేడియంలో అందుబాటులోకి రానున్నట్లు గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని తెలిపారు.

Story first published: Friday, October 25, 2019, 15:41 [IST]
Other articles published on Oct 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X