న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లీషు గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ: వరల్డ్ మీడియా సైతం ప్రశంస

By Nageshwara Rao
World media hails Virat Kohli’s heroics after he scored 149 in the first Test

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రపంచంలోని పలు మీడియా సంస్థలు ప్రశంసల జల్లు కురిపించాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సహచరులందరూ వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఇది కోహ్లీకి ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టెస్ట్‌ సెంచరీ కాగా.. కెరీర్‌లో 22వ సెంచరీ. అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఓ భారత కెప్టెన్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీని అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీపై వరల్డ్ మీడియా సైతం ప్రశంసల వర్షం కురిపించింది.

ఇంగ్లీషు గడ్డపై తొలిసారి సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పలు వరల్డ్ మీడియా సంస్థలు ప్రత్యేక వార్తా కథనాలు రాయడంతో పాటు ఆకర్షణీయమైన హెడ్డింగ్‌లు కూడా పెట్టాయి. ప్రపంచంలోని కొన్ని ఇంగ్లీష్‌ పత్రికలు కోహ్లీ గురించి ఏమని రాశాయో ఒక్కసారి పరిశీలిద్దాం...

1
42374
  1. 'కింగ్‌ కోహ్లీ పోరాటంతో ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది' - cricket.com.au
  2. 'విరాట్‌ కోహ్లీ హీరో. ఒంటరి పోరాటం చేశాడు. తన లైఫ్‌టైమ్‌లో ఎప్పటికీ మరిచిపోలేని ఇన్నింగ్స్‌ ఆడాడు' - theguardian.com
  3. 'భారత టాప్‌ ఆర్డర్‌ను కురన్‌ కుప్పకూల్చాడు. కానీ కోహ్లీ అద్భుతమైన శతకంతో భారత్‌ను కాపాడాడు' - telegraph.co.uk
  4. 'ఎడ్జ్‌బాస్టన్‌లో మాస్టర్‌ కోహ్లీ తన సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు' - stuff.co.nz

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లీ 149 పరుగులతో సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులతో పటిష్టి స్థితిలో నిలిచింది.

Story first published: Friday, August 3, 2018, 19:43 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X