న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహమ్మారిని జయించి కెరీర్‌లో రాణించిన క్రికెటర్లు వీరే

 World Diabetes Day: 5 cricketers who succeeded beating diabetes

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా చిల్డ్రన్స్ డే(బాలల దినోత్సవం) నవంబరు 20న జరుపుకుంటుంటే భారత్‌లో మాత్రం నవంబరు 14న జరుపుకుంటున్నారు. దీంతో భారతీయులు నవంబరు 14కు ఉన్న మరో ప్రత్యేకతను ప్రజలు మర్చిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1954వ సంవత్సరం నుంచి మధుమేహ దినంగా గుర్తుంచుకుంటున్నారు. ప్రజల్లో మధుమేహం(షుగర్) గురించి అవగాహన కల్పించి వారి దైనందిక జీవితంలో మార్పు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం.

ఈ రోజును ప్రపంచమంతా గుర్తుంచుకుంటుంది. ఈ సందర్భంగా మధుమేహాన్ని సవాల్ చేసి.. క్రికెట్ ద్వారా దానిని తమ జీవితాల్లో నుంచి పారద్రోలిన క్రికెటర్లను ఇప్పుడు గుర్తు తెచ్చుకుందాం.

1. వసీం అక్రమ్‌(పాకిస్థాన్‌):

1. వసీం అక్రమ్‌(పాకిస్థాన్‌):

పాక్ ప్రధాని వసీం అక్రం.. 1984లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన అక్రమ్‌.. కెరీర్‌ సాఫీగా సాగిపోతున్న సమయంలో 1997లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టైప్‌-1 డయాబెటిస్‌ బారిన పడ్డాడు. దాంతో 29సంవత్సరాల వసీం.. కెరీర్‌ ముగిసినట్లేనని భావించాడట. మళ్లీ క్రికెట్‌ ఆడే అవకాశాలు కూడా లేవనుకున్నాడట. భార్య సహకారంతో ఆహారం, వ్యాయామం విషయంలో తగిన నియమాలు పాటిస్తూ.. మొత్తంగా మధుమేహాన్ని తన అదుపులోకి తెచ్చుకుని క్రమంగా అధిగమించాడు.

2. క్రెగ్‌ కమింగ్‌(న్యూజిలాండ్‌):

2. క్రెగ్‌ కమింగ్‌(న్యూజిలాండ్‌):

న్యూజిలాండ్‌కు మాజీ క్రికెటర్‌ క్రెగ్ కమింగ్ కూడా మధుమేహాన్ని ఎదురించాడు. 2006లో టైప్‌-1 డయాబెటిస్‌ బారిన పడి మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఓ స్నేహితుడి సలహాతో ఆహారపు అలవాట్లు పాటిస్తూ.. ఇన్సులిన్‌ ఆధారంగా మధుమేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. కమ్మింగ్‌ న్యూజిలాండ్‌ తరఫున 23అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడాడు.

3. డిర్క్‌ వెల్లమ్:

3. డిర్క్‌ వెల్లమ్:

ఆస్ట్రేలియాకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ డిర్క్ వెల్లమ్ కూడా టైప్‌-1 డయాబెటిస్‌ బాధితుడే. ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తూ ఆ వ్యాధిని తన నియంత్రణలోకి తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ఏకంగా 22అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, 148 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో మెరిశాడు.

4. మెక్‌మిలాన్‌(న్యూజిలాండ్‌):

4. మెక్‌మిలాన్‌(న్యూజిలాండ్‌):

న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మెక్‌మిలాన్ 1997లో ఆసీస్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. క్రికెట్‌లోకి రాకముందే 15ఏళ్ల వయస్సులోనే టైప్‌-1 డయాబెటిస్‌‌తో అనారోగ్యం బారిన పడ్డాడు. క్రికెట్‌లోకి వచ్చాక వ్యాధిని నియంత్రించుకోవడానికి అతని వద్దనే నిత్యం జెల్లీబీన్స్‌ ఉంచుకునేవాడట. ఇలా ఈ వ్యాధిని అదుపులోకి తెచ్చుకొని ఏకంగా 11ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ను విజయవంతంగా ముగించాడు.

5. జాన్‌ మెక్‌లారెన్‌(ఆస్ట్రేలియా):

5. జాన్‌ మెక్‌లారెన్‌(ఆస్ట్రేలియా):

ఆస్ట్రేలియాకు మాజీ బ్యాట్స్‌మన్‌ జాన్ మెక్‌లారెన్ 34ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడాడు. 1912లో ఒక టెస్టు మ్యాచ్‌ కూడా ఆడాడు. కెరీర్‌లో నిలదొక్కుకునే క్రమంలో 1921లో డయాబెటిస్‌తో మరణించాడు.

Story first published: Wednesday, November 14, 2018, 15:22 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X