న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెటిజన్లను ఆకట్టుకుంటున్న వరల్డ్‌కప్ విజేతల సెల్ఫీ.. ఎందుకు కలిశారంటే

World Cup Heros Ms Dhoni, Kapil Dev Selfie Goes Viral on Socia Media, They Met for Golf course Event

భారత ప్రపంచకప్ విజేతలు అయిన ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్ ఒక్కచోట చేరారు. గురుగ్రామ్‌లో నిర్వహించనున్న కపిల్ దేవ్ - గ్రాంట్ థార్న్‌టన్ గోల్ఫ్ కోర్స్‌లో వీరిద్దరు కలిశారు. ఆ టోర్నీ ఆహ్వానానికి వచ్చిన వీరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కపిల్ దేవ్‌కు గోల్ఫ్‌పై ఎంతో మక్కువ ఉంది. అతను గోల్ఫ్ కోర్సులో చాలా పోటీతత్వాన్ని చూపించగలడు. ఇకపోతే ధోనీకి కూడా ఈ క్రీడలోను మంచి నైపుణ్యం ఉన్నట్లు ఈ సందర్భంగా పోస్టు చేసిన వీడియో బట్టి తెలుస్తోంది. క్రికెట్లో బిగ్ హిట్టింగ్ సామర్థ్యానికి పేరుగాంచిన ధోనీ ఆహ్వాన టోర్నమెంట్‌లో తన గోల్ఫ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇకపోతే ధోనీ గోల్ఫ్ బంతిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. అలాగే కపిల్ దేవ్, ధోనీ కలిసి దిగిన సెల్ఫీ కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. గోల్ఫ్ కోర్స్‌లో క్లీన్‌గా కొట్టగల తన సామర్థ్యంతో ధోని అభిమానులను, తోటి పోటీదారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక ధోనీతో కలిసి దిగిన ఫోటోను కపిల్ దేవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోల్ఫ్‌లో ధోనీ తన నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ధోని తన మాజీ చెన్నై సూపర్ కింగ్స్, భారత సహచరుడు కేదార్ జాదవ్‌తో కలిసి గోల్ఫ్ సెషన్‌లను ఆస్వాదిస్తున్నట్లు అప్పట్లో ఓ వీడియో బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ధోనీ, కపిల్ దేవ్ యూఎస్ ఓపెన్ 2022లో ఇద్దరు కలిసి కన్పించారు. ఇకపోతే ఐపీఎల్ రాబోయే ఎడిషన్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. ధోనీ 2023లో కూడా ఐపీఎల్ ఆడడానికి ప్రధాన కారణం.. చెన్నై అభిమానుల ముందు తాను క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనుకోవడమే. ఇకపోతే ధోనీ 2020 ఆగస్టులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ అతను ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ ఉన్నాడు. అతను ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు.. ఆ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.

Story first published: Friday, September 30, 2022, 21:30 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X