న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup flashbacks: వరల్డ్‌కప్ ఫైనల్లో 5 వికెట్లు తీసింది ఇద్దరే

World Cup flashbacks: Only Gary Gilmour & Joel Garner have taken 5-wicket hauls in WC final

హైదరాబాద్: గురువారం నుంచి ఇంగ్లాండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌కు తెరలేవనుంది. సాధారణంగా వరల్డ్‌కప్ అంటేనే రికార్డుల మోత. బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద పారిస్తే, బౌలర్లు తమ పేస్, స్వింగ్‌తో వికెట్లను తీస్తుంటారు. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే అనేక మంది సెంచరీలు నమోదు చేయడాన్ని మనం చూశాం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
1975 నుంచి 2015 వరకు జరిగిన వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్‌లో ఇప్పటివరకు ఆరు సెంచరీలు నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో బ్యాటర్స్‌తో పోలిస్తే బౌలర్లు కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. మొత్తం 11 ఫైనల్స్‌లో కేవలం నలుగురు బౌలర్లు మాత్రమే తమ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నారు.

పైనల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లు ఇద్దరే

పైనల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లు ఇద్దరే

1983లో మొహిందర్ అమర్నాధ్, 1992లో వసీమ్ అక్రమ్, 1999లో షేన్ వార్న్, 2015లో జేమ్స్ ఫల్కనర్‌లు వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్ మ్యాచ్‌ల్లో బ్యాటర్స్ సెంచరీలు బాది జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తే, బౌలర్లు మాత్రం ఐదు వికెట్లు తీసిన సందర్భాలు చాలా తక్కువ. వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఇద్దరు బౌలర్లు మాత్రమే ఐదు వికెట్లను తీశారు. వారెవరో ఒక్కసారి చూద్దాం....

1975 వరల్డ్‌కప్ ఫైనల్: గారీ గిల్ముర్(ఆస్ట్రేలియా) - (5/48)

1975 వరల్డ్‌కప్ ఫైనల్: గారీ గిల్ముర్(ఆస్ట్రేలియా) - (5/48)

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండిస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఎడమ చేతివాటం మీడియం పేస్ బౌలర్ గారీ గిల్ముర్ 12 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. గిల్ముర్ తీసిన ఐదు వికెట్లు అల్విన్ కాళీచరణ్, క్లైవ్ లాయిడ్, రోహాన్ కన్హాయి. వివ్ రిచర్డ్స్, ముర్రే. గిల్ముర్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ వెస్టిండిస్ ఈ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. అంతకముందు ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీపైనల్ మ్యాచ్‌లో గిల్ముర్ 14 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.

1979 ఫైనల్: జోయిల్ గార్నెర్(వెస్టిండిస్) - (5/38)

1979 ఫైనల్: జోయిల్ గార్నెర్(వెస్టిండిస్) - (5/38)

లార్డ్స్ వేదికగా జరిగిన ఈ పైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-వెస్టిండిస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. అనంతరం చేధనలో ఇంగ్లాండ్ 182/2 ఉన్న స్థితిలో జోయిల్ గార్నెర్ విజృంభించాడు. తొలుత గ్రాహమ్ గూచ్‌ను పెవిలియన్‌కు చేర్చిన జోయిల్ గార్నెర్ ఆ తర్వాత వరుసగా డేవిడ్ గోవర్, వెయినీ లార్కెన్స్, క్రిస్ ఓల్డ్, బాబ్ టేలర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 194 పరుగులకే ఆలౌటైంది. దీంతో వెస్టిండిస్ జట్టు 92 పరుగులతో విజయం సాధించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన వివ్ రిచర్డ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లబించింది.

Story first published: Wednesday, May 29, 2019, 12:34 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X