న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా తొలి వరల్డ్‌కప్‌ను ఎప్పుడు నెగ్గిందో తెలుసా?

World Cup flashbacks: Australia clinch first title in 1987 under Allan Border

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌ను కొన్ని ఏళ్ల పాటు శాసించింది. ఇప్పటివరకు జరిగిన పదకొండు వరల్డ్‌కప్‌ల్లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. వరుసగా నాలుగు సార్లు వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 12వ ఎడిషన్‌లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అలాంటి ఆస్ట్రేలియా జట్టు తొలి వరల్డ్‌కప్‌ను ఎప్పుడు నెగ్గిందో తెలుసా?

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మొదటి మూడు వరల్డ్‌కప్‌లకు ఇంగ్లాండే ఆతిథ్యమిచ్చింది. తొలి రెండు వరల్డ్‌కప్‌ల్లో వెస్టిండిస్ విజేతగా నిలివగా... మూడో వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. దీంతో నాలుగో వరల్డ్‌కప్‌కు ఇండియా-పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి.

ఇండియా-పాక్ సంయుక్తంగా ఆతిథ్యం

ఇండియా-పాక్ సంయుక్తంగా ఆతిథ్యం

అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన ఈ మెగా టోర్నీలో అన్ని జట్లు తెల్లటి దుస్తుల్లో ఆడాయి. అంతేకాదు అప్పటివరకు 60 ఓవర్ల పాటు నిర్వహించిన వన్డేని ఈ వరల్డ్‌కప్‌లో 50 ఓవర్లకు తగ్గించారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఏడు టెస్టు హోదా పొందిన దేశాలు కాగా జింబాబ్వే 8వ జట్టుగా బరిలోకి దిగింది. మొత్తం 14 వేదికలు ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఇందులో 7 పాకిస్థాన్‌లో ఉన్నాయి.

గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు ఇండియా, ఆస్ట్రేలియా

గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు ఇండియా, ఆస్ట్రేలియా

ఉపఖండంలో ఈ టోర్నీ జరగడంతో ఫైనల్లో పాకిస్థాన్-ఇండియా జట్లు తలపడతాయని అంతా భావించారు. అయితే, పైనల్లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. గ్రూప్-ఏలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఓడింది.

న్యూజిలాండ్‌పై భారత్ విజయం

న్యూజిలాండ్‌పై భారత్ విజయం

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతన్ శర్మ హ్యాట్రిక్, సునీల్ గవాస్కర్ సెంచరీ సాధించడంతో టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరాయి. గ్రూప్ స్టేజిలో వెస్టిండిస్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించడం... మరోవైపు శ్రీలంక ఒకే ఒక్క పాయింట్‌తో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో గ్రూప్-బీ నుంచి ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు సెమీస్‌కు చేరాయి.

ఇంగ్లాండ్ చేతిలో కపిల్ సేన ఓటమి

ఇంగ్లాండ్ చేతిలో కపిల్ సేన ఓటమి

ముంబై వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు లాహోర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీపైనల్లో పాకిస్థాన్‌పై అలెన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 18 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇక, నవంబర్ 4వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు పైనల్లో తలపడ్డాయి.

ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం

ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం

ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ బూమ్ 75 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. తక్కవ స్కోరే కావడంతో అంతా ఇంగ్లాండ్ గెలుస్తుందని భావించారు. అయితే, ఛేదనలో కెప్టెన్ మైక్ గెటింగ్ చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Friday, May 24, 2019, 16:52 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X