న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ గెలవడం వారికి ఇష్టం లేదు: సంచలన వ్యాఖ్యలు చేసిన ఓపెనర్

ICC Cricket World Cup 2019 : Jonny Bairstow Says Critics Want England Fail-ICC World Cup 2019
orld Cup 2019: Jonny Bairstow says critics want England to fail, Michael Vaughan furious

హైదరాబాద్: ప్రపంచకప్‌ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ల నుంచే ఆ జట్టు విమర్శలను ఎదుర్కొంటుంది. మోర్గాన్‌ సేనపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌లు మండిపడ్డారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వరల్డ్‌కప్‌ వేదికలో ఇంగ్లండ్‌కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన అంటూ వాన్‌ తీవ్రంగా విమర్శించగా, మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌ను చూసి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ భయపడ్డాడని కెవిన్‌ పీటర్సన్‌ చురకలంటించాడు. ఇలా తమపై వస్తున్న విమర్శలపై ఓపెనర్‌ బెయిర్‌ స్టో కాస్తంత ఘాటుగా స్పందించాడు.

బెయిర్ స్టో మాట్లాడుతూ

బెయిర్ స్టో మాట్లాడుతూ

దీంతో బెయిర్ స్టో మాట్లాడుతూ "మా జట్టు సమిష్టి పోరాటంలో ఎటువంటి వెనుకంజ లేదు. వన్డే ఫార్మాట్‌లో గడిచిన మూడేళ్ల కాలంలో అద్భుతాలు విజయాలు సాధించాం. దాదాపు ప్రస్తుతం ఉన్న జట్టుతోనే నంబర్‌ ర్యాంకును సుదీర్ఘ కాలం కాపాడుకున్నాం. కొంతమందికి ఇంగ్లండ్‌ గెలవడం ఇష్టం లేదు" అని అన్నాడు.

మేము పరాజయం చెందితే

మేము పరాజయం చెందితే

"మేము పరాజయం చెందితే చూసి ఆనందించాలని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారు" అని బెయిర్‌ స్టో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సహచరులకు బెయర్‌ స్టో విజ్ఞప్తి చేశాడు. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుదామని సహచర ఆటగాళ్లకు సూచించాడు.

బెయిర్ స్టో వ్యాఖ్యలపై

బెయిర్ స్టో వ్యాఖ్యలపై

బెయిర్ స్టో వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన మాజీ క్రికెటర్ మైకేల్‌ వాన్‌ "బెయిర్‌ స్టోవి తప్పుడు ఆరోపణలు. ఇంతకుముందెన్నడూ లేనంత మద్దతు ప్రస్తుతం ఇంగ్లండ్‌కు లభిస్తుంది. అయితే నువ్వు, మీ జట్టు నిరాశ పరుస్తున్నారు. రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌కు వెళ్లండి చాలు" అని అన్నారు.

భారత్, న్యూజిలాండ్‌తో

భారత్, న్యూజిలాండ్‌తో

టోర్నలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లు టోర్నీలో అద్భుత విజయాలను నమోదు చేశాయి. టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది.

ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ

ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ

మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

8 పాయింట్లతో నాలుగో స్థానంలో

8 పాయింట్లతో నాలుగో స్థానంలో

ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్‌లు ఆడి, చెరో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్‌లకు వరుణుడు అంతరాయం కలిగిస్తే ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి అంతే మరి.

Story first published: Saturday, June 29, 2019, 10:24 [IST]
Other articles published on Jun 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X