న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెట్ రన్‌రేట్‌తో పని లేకుండా పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే!

 World Cup 2019: How Pakistan can qualify for the semi-finals without considering net run rate

హైదరాబాద్: ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆట ఏమంత గొప్పగా లేదు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. ఇక, మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వగా.. ఓ మ్యాచ్‌ రద్దు అయింది. ఈ నేపథ్యంలో 5 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌ ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఈ మెగా టోర్నీలో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న పాక్ తన తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.

ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే పాక్ ఖాతాలో మొత్తం 11 పాయింట్లు చేరతాయి. దీంతో నాకౌట్‌ చేరొచ్చు. ప్రస్తుతం 11 పాయింట్లతో పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాత ఆస్ట్రేలియా(10), ఇండియా(9) పాయింట్లతో కొనసాగుతున్నాయి.

మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడి 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో ఇంగ్లాండ్‌ ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే పాకిస్థాన్‌కు అవకాశముంటుంది. అయితే, పాక్ ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో ఆప్ఘనిస్థాన్‌పై గెలిచే అవకాశాలు ఉన్నా.. న్యూజిలాండ్‌, బంగ్లాను ఓడించడం అంత తేలికకాదు.

Story first published: Tuesday, June 25, 2019, 15:22 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X