న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ రికార్డు సెంచరీలు: సచిన్ 6, గంగూలీ 4, కోహ్లీ 2

By Nageswara Rao

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ 2015లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ సెంచరీలు సాధించి పాకిస్ధాన్, దక్షిణాఫ్రికాలపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు 23 సెంచరీలు సాధించారు.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 6 సెంచరీలు సాధించగా, సౌరభ గంగూలీ 4, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలు 2, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, అజయ్ జడేజా ఒక్కో సెంచరీని సాధించారు.

టీమిండియా ఆటగాళ్లు 18 మ్యాచ్‌‌ల్లో 23 సెంచరీలు సాధించడం విశేషం. ఇందులో భారత్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, మూడింటిలో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.

World Cup 2015: List of centuries scored by Indians in World Cup cricket

సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:

* కపిల్ దేవ్ - 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై 138 బంతుల్లో 175 పరుగులు (ఇండియా గెలిచింది)

* సునీల్ గవాస్కర్ - 1987 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 149 బంతుల్లో 103 పరుగులు (ఇండియా గెలిచింది)

* సచిన్ టెండూల్కర్ - 1996 వరల్డ్ కప్‌లో కెన్యాపై 138 బంతుల్లో 127 పరుగులు (ఇండియా గెలిచింది)

* సచిన్ టెండూల్కర్ - 1996 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై 137 బంతుల్లో 137 పరుగులు (ఇండియా ఓడింది)

* వినోద్ కాంబ్లీ - 1996 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై 110 బంతుల్లో 106 పరుగులు (ఇండియా గెలిచింది)

* సౌరభ్ గంగూలీ - 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై 158 బంతుల్లో 183 పరుగులు (ఇండియా గెలిచింది)

* రాహుల్ ద్రవిడ్ - 1999 వరల్డ్ కప్‌లో కెన్యాపై 129 బంతుల్లో 145 పరుగులు (ఇండియా గెలిచింది)

* సచిన్ టెండూల్కర్ - 1999 వరల్డ్ కప్‌లో కెన్యాపై 101 బంతుల్లో 140 పరుగులు (ఇండియా గెలిచింది)

* రాహుల్ ద్రవిడ్ - 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై 109 బంతుల్లో 104 పరుగులు (ఇండియా గెలిచింది)

* అజయ్ జడేజా - 1999 వరల్డ్ కప్‌లో ఆస్టేలియాపై 138 బంతుల్లో 100 పరుగులు (ఇండియా ఓడింది)

* సచిన్ టెండూల్కర్ - 2003 వరల్డ్ కప్‌లో నమీబియాపై 152 బంతుల్లో 151 పరుగులు (ఇండియా గెలిచింది)

* సౌరభ్ గంగూలీ - 2003 వరల్డ్ కప్‌లో నమీబియాపై 112 బంతుల్లో 119 పరుగులు (ఇండియా గెలిచింది)

* సౌరభ్ గంగూలీ - 2003 వరల్డ్ కప్‌లో కెన్యాపై 112 బంతుల్లో 120 పరుగులు (ఇండియా గెలిచింది)

* సౌరభ్ గంగూలీ - 2003 వరల్డ్ కప్‌లో కెన్యాపై 111 బంతుల్లో 114 పరుగులు (ఇండియా గెలిచింది)

* వీరేంద్ర సెహ్వాగ్ - 2007 వరల్డ్ కప్‌లో బర్ముడాపై 114 బంతుల్లో 87 పరుగులు (ఇండియా గెలిచింది)

* వీరేంద్ర సెహ్వాగ్ - 2011 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 175 బంతుల్లో 140 పరుగులు (ఇండియా గెలిచింది)

* విరాట్ కోహ్లీ - 2011 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 100 బంతుల్లో 83 పరుగులు (ఇండియా గెలిచింది)

* సచిన్ టెండూల్కర్ - 2011 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 120 బంతుల్లో 115 పరుగులు (మ్యాచ్ టై)

* సచిన్ టెండూల్కర్ - 2011 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై 111 బంతుల్లో 115 పరుగులు (ఇండియా ఓడింది)

* యువరాజ్ సింగ్ - 2011 వరల్డ్ కప్‌లో వెస్టిండిస్‌పై 113 బంతుల్లో 123 పరుగులు (ఇండియా గెలిచింది)

* విరాట్ కోహ్లీ - 2015 వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్‌పై 107 బంతుల్లో 126 పరుగులు (ఇండియా గెలిచింది)

* శిఖర్ ధావన్ - 2015 వరల్డ్ కప్‌లో దక్షిణాప్రికాపై 137 బంతుల్లో 146 పరుగులు (ఇండియా గెలిచింది)

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X