న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్‌గేల్ డేంజర్: వెస్టిండీస్‌తో భారత్ 7సార్లు ఢీ, ఆసక్తికర విషయాలు

By Srinivas

పెర్త్: ప్రపంచ కప్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ శుక్రవారం నాడు వెస్టిండీస్‌తో తలపడనుంది. భారత్... పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, యూఏఈలతో గెలిచి పూల్ బీలో అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్.. భారత్‌కు అత్యంత ప్రమాదకర ఆటగాడు అని చెప్పవచ్చు. అతను ఫాంలోకి వస్తే దూకుడును ఆపడం కష్టమే.

భారత్, వెస్టిండీస్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్లకు సంబంధించిన కొన్ని అంశాలు...

ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్‌లు ఇప్పటి వరకు ఏడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో భారత్ నాలుగుసార్లు, వెస్టిండీస్ మూడుసార్లు గెలిచింది. ఇది ఎనిమిదో మ్యాచ్.

ఇరు జట్ల మధ్య ఎక్కువ మ్యాచులు ఆడిన వారిగా భారత్ తరఫున కపిల్ దేవ్, వెస్టిండీస్ తరఫున డెస్మండ్ హెయిన్స్‌లు ఉన్నారు. ఇరువురు కూడా 5 మ్యాచులు ఆడారు. వారు 1979 నుండి 1992 మధ్య ఆడారు.

ప్రపంచకప్‌లో.. భారత్ - వెస్టిండీస్ జట్లు తొలిసారి 1979లో తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ గెలుపొందింది.

ఇరు జట్ల తరఫున వినియన్ రిచర్డ్స్ ఎక్కువ పరుగులతో నిలిచాడు. అతను 197 పరుగులు చేశాడు. (నాలుగు ఇన్నింగ్స్, ఒక సెంచరీ) మైకేల్ హోల్డింగ్ ఎక్కువ వికెట్లు తీశాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో పదకొండు వికెట్లు తీశాడు. భారత్‌తో ఆడిన మ్యాచులలో వెస్టిండీస్ బౌలర్లలో హోల్డింగ్ నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్నాడు.

వెస్టిండీస్ రెండు సెంచరీలు చేసింది. 1979లో గోర్డాన్ గ్రీనిడ్జ్ 106*. 1983లో వినియన్ రిచర్డ్స్ 119 పరుగులు చేశాడు. భారత్ తరఫున యువరాజ్ సింగ్ 2011లో 113 పరుగులు చేశాడు.

భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది అమర్నాథ్. నాలుగు ఇన్నింగ్స్‌లలో 135 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ 80 రన్స్. ఎక్కువ వికెట్లు తీసింది రోజర్ బిన్నీ. అతను 3 ఇన్నింగ్సులలో 7 వికెట్లు తీశాడు. బెస్ట్ 3/48.

భారత్ - వెస్టిండీస్ పోరులో గోర్డాన్ గ్రీనిడ్జ్, డెస్మాండ్ హెయాన్స్ తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు చేశారు. 1979లో వారు 138 పరుగులు చేశారు. ఆండీ రాబర్డ్స్, గార్నర్‌లు పదో వికెట్‌కు అత్యధికంగా 71 పరుగులు చేశారు. ఇది రికార్డ్. 1992లో అథర్టన్, హూపర్‌లు ఆరో వికెట్‌కు 83* పరుగులు చేశారు.

World Cup: 10 facts about India-West Indies match in Perth

1983లో భారత్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌ను ఓడించి తొలి ప్రపంచ కప్ గెలిచింది.

ఏడు మ్యాచులలోను వేర్వేరు ఏడుగురు మేన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు.

2011 - 80 పరుగులతో భారత్ గెలిచింది. (యువరాజ్ సింగ్ - మేన్ ఆఫ్ ది మ్యాచ్)

1996 - ఐదు వికెట్లతో భారత్ గెలిచింది. (సచిన్ టెండుల్కర్ - మేన్ ఆఫ్ ది మ్యాచ్)

1992 - వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. (అండర్సన్ - మేన్ ఆఫ్ ది మ్యాచ్)

1983 - ఫైనల్ - 43 పరుగులతో భారత్ గెలిచింది. (మోహిందర్ అమర్నాథ్ - మేన్ ఆఫ్ ది మ్యాచ్)

1983 - లీగ్ గేమ్ - 66 పరుగులతో వెస్టిండీస్ గెలిచింది. (వివియన్ రిచర్డ్స్ - మేన్ ఆఫ్ ది మ్యాచ్)

1983 - లీగ్ గేమ్ - 34 పరుగులతో భారత్ గెలిచింది. (యశ్‌పాల్ శర్మ- మేన్ ఆఫ్ ది మ్యాచ్)

1979 - 9 వికెట్లతో వెస్టిండీస్ గెలిచింది. (గోర్డాన్ గ్రీనిడ్జ్ - మేన్ ఆఫ్ ది మ్యాచ్)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X