న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంధాన మెరుపులు, వరల్డ్ కప్‌లో వరుసగా నాల్గో విజయం

Womens World T20: Mandhana hits 83 to set up Indias 48-run win over Australia

హైదరాబాద్: ఐసీసీ టీ20 మహిళా ప్రపంచ కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోగా.. ఆస్ట్రేలియాతో నాలుగో మ్యాచ్‌లోనూ విజేతగా నిలిచి వేగాన్ని మరింత పెంచింది. గ్రూప్ బిలో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 48 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయదుందుబి మోగించించి గ్రూప్-బిలో అగ్రస్థానం కైవసం చేసుకుంది.

168 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ మహిళల జట్టు మరో రెండు బంతులు మిగిలుండానే 119 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లాడి 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఆసీస్‌ను బెంబెలెత్తించింది.

మ్యాచ్‌కు హైలెట్‌గా మంధాన, హర్మన్‌‌లు

మ్యాచ్‌కు హైలెట్‌గా మంధాన, హర్మన్‌‌లు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ మ్యాచ్‌కు మూల స్తంభంలా నిలిచింది. మిథాలీరాజ్‌కు విశ్రాంతినివ్వడంతో ఆమె స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన తానియా భాటియా (2) స్వల్ప స్కోరుకే ఔటైంది. కానీ మంధాన మాత్రం.. మెరుపు షాట్లతో అదరగొట్టింది. మోలినిక్స్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టిన ఆమె..ఆ తర్వాత షట్‌ బౌలింగ్‌లోనూ మరో భారీ సిక్స్‌ బాదింది.

స్మృతి 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

స్మృతి 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

జెమిమా (6) ఔటైన తర్వాత హర్మన్‌ప్రీత్‌ క్రీజులోకి రావడంతో భారత ఇన్నింగ్స్‌ తీరే మారిపోయింది. వీళ్లిద్దరూ పోటీపడి మరీ ఆసీస్‌ బౌలర్లను ఉతికారు. ఈ క్రమంలో స్మృతి 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మరోవైపు మెలినెక్స్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదిన హర్మన్‌.. కిమిన్స్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించింది. కానీ మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఆమె హేన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. ఆ తర్వాత భారత్‌ వికెట్ల పతనం ఆగలేదు.

టీ20ల్లో 1000 పరుగుల మార్కును

టీ20ల్లో 1000 పరుగుల మార్కును

వేద (3) వ్లామింక్‌ పట్టిన మెరుపు క్యాచ్‌కు ఔట్‌ కాగా.. హేమలత (1)ను పెర్రీ బౌల్డ్‌ చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మంధాన మాత్రం దూకుడు తగ్గించలేదు. వీలు చిక్కినప్పుడల్లా ముచ్చటైన షాట్లు కొట్టిన ఆమె సెంచరీ చేసేలా కనిపించింది. కిమిన్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో టీ20ల్లో 1000 పరుగుల మార్కును అందుకుంది. మిథాలీరాజ్‌ తర్వాత వేగంగా ఈ మైలురాయిని దాటిన ఘనత ఆమెదే. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మంధాన ఔట్‌ కావడంతో భారత్‌ ఊహించిన దానికన్నా తక్కువ స్కోరే చేసింది.

 మరోసారి విజయ దుందుభి

మరోసారి విజయ దుందుభి

168 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగన ఆసీస్ జట్టును భారత బౌలర్ దీప్తి శర్మ వణికించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో వరుస బంతుల్లో ఎలైస్ విలాణి(6), బెన్ మూనీ(19)లను వెనక్కి పంపింది. భారత బౌలర్లు చెలరేగడంతో ఎలైస్ పెర్రీ (39 నాటౌట్), గార్డ్‌నర్ (20), కెప్టెన్ మెగ్ లానింగ్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. అనుజ పాటిల్ 3 వికెట్లు పడగొట్టగా, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

రెండు జట్లు ఇదివరకే సెమీఫైనల్స్ చేరుకున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సీనియర్ బ్యాట్స్‌ఉమెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌కి అనారోగ్యం కారణంగా దూరమైంది.

Story first published: Sunday, November 18, 2018, 10:24 [IST]
Other articles published on Nov 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X