న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇకపై భారత్‌లో ప్రతి ఏటా ఓ డే/నైట్ టెస్టు, కోహ్లీతో కష్టమేనా?: గంగూలీ స్పెషల్ ఇంటర్యూ

Will try to play one day-night Test every year in India: BCCI president Sourav Ganguly

హైదరాబాద్: ఇకపై ప్రతిఏటా భారత్‌లో ఒక డే-నైట్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. భారత టెస్టు క్రికెట్లో చరిత్రలో ఓ సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభం కానుంది. టీమిండియా భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు ఆడబోతోంది.

నవంబర్‌ 22 నుంచి 26 వరకు భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. డే/నైట్ టెస్టుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒప్పించాడు.

Well done Bangladesh: ఇరు జట్లకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపిన గంగూలీWell done Bangladesh: ఇరు జట్లకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపిన గంగూలీ

డే/నైట్ టెస్టులపై

డే/నైట్ టెస్టులపై

ఇకపై ప్రతి ఏటా భారత్‌లో ఓ డే/నైట్ టెస్టు ఆడతాం. ఒక మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాం. టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు, మేము సందర్శించే ఆ దేశ బోర్డుతో మాట్లాడుతాం. ఆ పర్యటనలో ఏదైనా టెస్టుని డే/నైట్ టెస్టుగా ప్రదర్శించేందుకు సాధ్య సాధ్యాలను చూస్తాం

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ విభజన

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ విభజన

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ అనుభవం, కోహ్లీ లేనప్పుడు జాతీయ జట్టు కూడా అతన్ని వైట్ బాల్ కెప్టెన్‌గా మార్చడానికి సరిపోతుందా? అని తరచుగా నన్ను అడుగుతున్నారు. దీనిపై ఇప్పుడే చర్చించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు.

బీసీసీఐ అధ్యక్షుడిగా కొత్త పాత్ర ఎలా ఉంది!

బీసీసీఐ అధ్యక్షుడిగా కొత్త పాత్ర ఎలా ఉంది!

నా మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. మీరు నాకు ఏ పదవి ఇచ్చినా దానిని నేను సమర్ధవంతగా నిర్వహిస్తానని అనుకుంటున్నాను. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న ఎవరూ మంచి క్రికెటర్ కాలేదు. మీరు కష్టమైన సవాల్‌ను స్వీకరించినప్పుడే మీరు గౌరవించబడతారు. నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను నా ఉత్తమ ప్రదర్శన చేస్తా.

కోహ్లీతో వ్యవహరించడం కష్టమేనా?

కోహ్లీతో వ్యవహరించడం కష్టమేనా?

అస్సలు కష్టం కాదు. నేను జట్టు ఎంపిక విషయాలలో పాల్గొనను

టెస్టులపై ఆసక్తి పెంచడానికి ఏమైనా ఇతర చర్యలు తీసుకుంటున్నారా?

టెస్టులపై ఆసక్తి పెంచడానికి ఏమైనా ఇతర చర్యలు తీసుకుంటున్నారా?

ఒక ఆర్డర్‌లో ఆ విషయాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి. అవును, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరిస్‌లో వారి ఆటతీరుతో నేను నిరాశపడ్డాను, కాని వారు తిరిగి పుంజుకోవడానికి కొంత సమయం అవసరమని నేను భావిస్తున్నా. పాకిస్థాన్, శ్రీలంకలతో జరిగిన సిరిస్‌ల విషయంలో ఇదే జరిగింది. అంతకముందు ఆస్ట్రేలియా ఈ రెండు జట్లతో జరిగిన సిరిస్‌ల్లో నిరాశ పరిచింది. కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా దారిలో పడింది.

జాతీయ సెలక్షన్ కమిటీపై మీరేమంటారు?

జాతీయ సెలక్షన్ కమిటీపై మీరేమంటారు?

"మేము అనుభవం మరియు సామర్థ్యం ఉన్న వ్యక్తులను పరిశీలిస్తాం" అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 4, 2019, 13:24 [IST]
Other articles published on Nov 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X