న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దక్షిణాఫ్రికా కప్ కొడితే.. నేను రిటైర్ అవుతా'

ICC World Cup 2019 : I'll Probably Retire If South Africa Win The World Cup
Will probably retire if South Africa win the World Cup - Tahir

న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. రిటైర్‌మెంట్ చేసే సమయాన్ని ప్రకటించాడు. మరి కొద్ది నెలల్లో మొదలుకానున్న ఐసీసీ వరల్డ్ కప్ అనంతరం తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సూచనలున్నాయని తెలియజేశాడు. బ్లోఫోంటైన్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాహిర్ మీడియాతో మాట్లాడాడు. తన నుంచి జట్టు ఏం కోరుకుంటుందో అంత ఇచ్చేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని తాహిర్ చెప్పాడు.

'ఇక నా రిటైర్‌మెంట్ గురించి ఇప్పుడే చెప్పాలంటే అది చాలా తొందరపెట్టినట్లే అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. ఒకవేళ రిటైర్ అవ్వాలి అనుకుంటే ఈ సారి ఐసీసీ వరల్డ్ కప్ 2019లో దక్షిణాఫ్రికా ప్రపంచ విజేతగా నిలబడితే మాత్రం.. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పగలనని స్పష్టం చేశాడు. ఈ ప్రపంచ కప్ నేపథ్యంలోనే తాను ఇప్పటి నుంచి బౌలింగ్‌లో కొత్త టెక్నిక్‌లు.. ఫీల్డింగ్‌లో స్థానాలను మార్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు.

'జట్టుకు నేనెప్పుడైతే అవసరమవుతానో అప్పుడు అందుబాటులో ఉంటా. మరో ఎగ్జైటింగ్ బౌలర్ దొరకడం కూడా మాకు అద్భుతమైన విషయం. షంశీ బాగా బౌలింగ్ చేస్తూ.. దినదినాభివృద్ధి చెందుతున్నాడు. తనకెప్పుడైనా సందేహాలుంటే నాతో చర్చిస్తుంటాడు. మనలోని ప్రతిభను పంచడం ద్వారా వేరే వాళ్లు లాభపడుతున్నారంటే అదొక రకమైన సంతృప్తిగా ఉంటుంది. అది కూడా స్పిన్ బౌలింగ్ గురించి అయితే మరింత బాగుంటుంది.'

'కొత్త ఆటగాళ్లలో స్పిన్నర్లు పెరుగుతుండటం చాలా చక్కని విషయం. నేను నా అనుభవాన్ని వాళ్లతో పంచుకోవడానికి సంతోషం వ్యక్తం చేస్తాను. దేశీవాలీ లీగ్‌లైన పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్), ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)ల ద్వారా యువ ఆటగాళ్లకు సదవకాశాలు లభిస్తున్నాయి.' అని తెలిపాడు.

Story first published: Wednesday, October 3, 2018, 12:45 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X