న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test Championship : ఇంగ్లాండ్‌తో ఓటమి తర్వాత ఇండియా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరాలంటే ఎలా?

Will India Qualify For World Test Championship Final After Losing To England In 5th Test

రీషెడ్యూల్ చేసి అయిదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విధించిన 378పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయసంగా ఛేదించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ అయిదో రోజు తొలి సెషన్లోనే గెలుపు లాంఛనాన్ని ముగించింది. ఫియర్‌లెస్ క్రికెట్‌ అనే కొత్త బ్రాండింగ్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్.. పడి లేచిన కెరటంలా టెస్ట్ క్రికెట్లో ఓ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఫలితంగా టెస్ట్ క్రికెట్లో చివరి ఇన్నింగ్స్‌లో 250కంటే ఎక్కువ లక్ష్యాలను వరుసగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా అవతరించింది. ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్ స్టో, జో రూట్ అరివీర భయంకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు బాగా ప్లస్ అవుతుంది. అలాగే బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న సీనియర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు తోడు కొత్త కుర్రాడు మ్యాటీ పాట్స్ కూడా ఇంగ్లాండ్‌‌కు మంచి బ్రేక్ త్రూస్ ఇస్తున్నారు.

బ్రెండన్ మెక్కల్లమ్, స్టోక్స్ ఆధ్వర్యంలో..

కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలో టెస్టుల్లో నయా పంథా క్రియేట్ చేసిన ఇంగ్లాండ్.. ప్రత్యర్థులపై అటాక్ చేయడమే పనిగా పెట్టుకుని సక్సెస్ అవుతుంది. ఇండియా మీద అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా కూడా ఇంగ్లాండ్ రికార్డు బద్ధలు కొట్టింది. ఇక ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరిగింది. ఈ మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్ తన విన్నింగ్ పర్సంటేజీని చాలా మెరుగుపరుచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో 3వ స్థానంలో కొనసాగుతుంది.

సౌతాఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలి

కాకపోతే ఇండియా విన్నింగ్ పర్సంటేజీ 58.33 నుంచి 53.47కు పడిపోయింది. అదే టైంలో 7వ స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ విన్నింగ్ పర్సంటేజీ 28.89 నుంచి 33.33కు పెరిగింది. ఎప్పటిలాగే ఆస్ట్రేలియా 77.78విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా 71.42శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికా ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు రాబోతుంది. మూడు టెస్టులు జరగనున్నాయి. ఇక సౌతాఫ్రికాను ఇంగ్లాండ్ మట్టికరిపించడం దాదాపు ఖాయమేననిపిస్తోంది. అదే జరిగితే సౌతాఫ్రికా విన్నింగ్ పర్సంటేజీ 60కంటే తక్కువకు పడిపోతుంది.

 మిగిలిన 6టెస్టుల్లో ఇండియా గెలవాలి

మిగిలిన 6టెస్టుల్లో ఇండియా గెలవాలి

సౌతాఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే ఇండియాకు ప్లస్ అవుతుంది. ప్రస్తుతం రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. మూడో స్థానంలో ఇండియా ఉంది. సౌతాఫ్రికా విన్నింగ్ పర్సంటేజీ తగ్గితే ఇండియాకు ఫైనల్ బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇండియా ఫైనల్ చేరాలంటే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 -23 సైకిల్లో భాగంగా ఇండియా ఆడబోయే మిగతా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లను గెలవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4టెస్టు మ్యాచ్‌ల్లో ఇండియా తలపడనుంది. అలాగే నవంబర్లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి అక్కడ రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్లో మొత్తం 6 మ్యాచ్‌లలో 6గెలిస్తే ఇండియాకు 68కి పైగా విన్నింగ్ పర్సంటేజీ వచ్చి ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. కానీ ఒకట్రెండు ఓడినా.. దక్షిణాఫ్రికాతో క్లాష్ అవడం ఖాయం. ఇక ఇండియాకు తాడో పేడో మరీ.

 ఏ దేశం ఏ స్థానంలో ఉందంటే?

ఏ దేశం ఏ స్థానంలో ఉందంటే?

ఇక ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1. ఆస్ట్రేలియా, 2. దక్షిణాఫ్రికా, 3.ఇండియా, 4.పాకిస్థాన్ (52.38), 5.వెస్టిండీస్ (50), 6.శ్రీలంక (47.62), 7. ఇంగ్లాండ్, 8.న్యూజిలాండ్ (25.93), 9.బంగ్లాదేశ్ (13.33) విన్నింగ్ పర్సంటేజీలతో ఈ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Story first published: Tuesday, July 5, 2022, 19:10 [IST]
Other articles published on Jul 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X