న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీని అవుట్ చేయాలని రాత్రంతా కలలు కంటాం'

 Will Go To Bed Dreaming Of Getting Virat Kohli, Says James Anderson

హైదరాబాద్: ఇండియాతో టెస్టు సిరీస్ మొదలుకాక ముందే కోహ్లీని ఎలా అవుట్ చేయాలా అని ఇంగ్లాండ్ బౌలర్లు భారీ ప్రణాళికలు రచించారు. గతంలో జరిగిన పర్యటనల ఆధారంగా కోహ్లీ ఆటతీరు అదే విధంగా ఉంటుందనుకొని దాని ప్రకారం వ్యూహరచన చేశారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ.. తానొక్కడే టీమిండియాను కేవలం 13పరుగుల వ్యత్యాసంతో మ్యాచ్‌ను ముగించాడు.

కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రణాళికలు

కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రణాళికలు

మళ్లీ అదే పట్టుదలతో విరాట్‌ కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఇంగ్లీషు బౌలర్లు. ఈ నేపథ్యంలో.. కోహ్లీ వికెట్‌ను ఎలా దక్కించుకోవాలో అనే విషయంపై రాత్రంతా తమ జట్టు ఆటగాళ్లంతా కలలు కంటామని అంటున్నాడు ఇంగ్లాండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. శుక్రవారం మూడో రోజు ముగిసిన అనంతరం అండర్సన్‌ మీడియాతో మాట్లాడాడు.

 దానిపైనే ఈ రాత్రి కలలు కంటానని

దానిపైనే ఈ రాత్రి కలలు కంటానని

తమ జట్టు విజయానికి కోహ్లీ ఒక్కడు మాత్రమే అడ్డుగా ఉన్నాడని భావించిన అండర్సన్.. అతడి వికెట్‌ ఎలా దక్కించుకోవాలన్న దానిపైనే ఈ రాత్రి కలలు కంటానని తెలిపాడు. ‘క్రికెట్‌ ప్రపంచంలో శక్తిమంతులు ఎవరూ ఉండరు. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ అయినా సరే ఏదో ఒక బౌలర్‌ చేతిలో, ఏదో ఒక బంతికి ఔటవ్వాల్సిందే. కోహ్లీ కూడా అంతే. కోహ్లీ వికెట్‌ ఎలా దక్కించుకోవాలన్న దానిపైనే ఈ రోజు రాత్రి మేమంతా కలలుకంటాం.' అంటున్నాడు.

లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల సహకారం అందితే మాత్రం

లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల సహకారం అందితే మాత్రం

'శనివారం 25 నుంచి 30 ఓవర్లకే మ్యాచ్ ఫలితం రావొచ్చని అనుకుంటున్నా. తొలి ఇన్నింగ్స్‌లోలా కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తూ ఉండి, లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల సహకారం అందితే మాత్రం కోహ్లీని ఔట్‌ చేయడం కష్టమే. కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మా ఫీల్డింగ్‌ ప్రదర్శన సరిగా లేదు. రెండేళ్ల నుంచి మా జట్టులో ఈ సమస్య ఉంది. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మా ఫీల్డింగ్‌ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా' అని అండర్సన్‌ తెలిపాడు.

విజయం సాధించాలంటే ఇంకా 84 పరుగులు

విజయం సాధించాలంటే ఇంకా 84 పరుగులు

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో విజయం సాధించాలంటే ఇంకా 84 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ (43*), దినేశ్‌ కార్తీక్‌(18*) మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచారు.

Story first published: Saturday, August 4, 2018, 15:46 [IST]
Other articles published on Aug 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X