కోర్టుకీడుస్తా, కంఠంలో ప్రాణముండగా విడాకులివ్వను: షమీ భార్య

Posted By:
Wife accuses cricketer Mohammed Shami of assault and extramarital affair

హైదరాబాద్: ప్రాణం పోయేంత వరకు తనకు విడాకులిచ్చే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చింది మొహమ్మద్ షమీ భార్య జహాన్. బుధవారం మీడియా ముందుకొచ్చిన తన ఆవేదనను బయటపెట్టింది. 'షమీ అడిగింది ఏదీ కాదనకుండా చేశాను. అయినా నన్ను టార్చర్‌కు గురి చేశాడు. ఏ రోజు భార్యలా చూడలేదు. తాను చాలా మోసగాడు (big flirt). నా గొంతులో ప్రాణముండగా విడాకులివ్వను. నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. అతన్ని కోర్టుకీడుస్తా' అని ఉద్వేగంతో చెప్పింది.

టార్చర్, చంపేందుకు యత్నం: క్రికెటర్ షమీ అక్రమ సంబంధాలపై భార్య సంచలన వ్యాఖ్యలు

దేశంలో చాలా మంది అమ్మాయిలతో షమికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఒక రోజు షమి కారులో మొబైల్‌ ఫోన్‌ దొరికిందట. అది ఓ చానెల్‌ తెలిపిన వివరాల ప్రకారం 2014లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది ఆమెకు దొరకడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఫోన్ ఓపెన్‌ చేసి చూడగానే అసభ్యకర సందేశాలు కనిపించాయట.

చాలా మంది అమ్మాయిలతో పాటు వారి పంపిన ఫొటోలు కనిపించాయని ఆమె తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయితో షమికి పెళ్లి అయిపోయిందని ఆమె వాపోయింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ అనంతరం షమి ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్‌ కూడా వెళ్లాడని వివరించింది.

'గతంలో ధర్మశాలలో టీమిండియా మ్యాచ్‌కు నన్ను తీసుకెళ్లమని షమిని కోరాను. అతడు వద్దన్నాడు. అక్కడితో ఊరుకోకుండా అక్కడి నుంచి నాకు ఫోన్‌ చేసి మరీ నన్ను తిట్టాడు. టీమిండియా ఎక్కడికి వెళ్లినా కుల్‌దీప్‌ అనే వ్యక్తి.. షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడు. బీసీసీఐకి ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు'అని హాసిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'త్వరలో షమితో పాటు ఆయన కుటుంబసభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా' అని ఆమె తెలిపారు. షమి-హాసిన్‌ది ప్రేమ వివాహం. 2014 జూన్‌ 6న వీరు పెళ్లి చేసుకున్నారు.

2012లో ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో షమి తొలిసారి హాసిన్‌ను చూశాడు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప. ఈ ఆరోపణలపై మహ్మద్‌ షమీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశాడు. తనపై వచ్చిన అభియోగాలన్నీ అసత్యమని, ఆటపై దృష్టి సారించకుండా తన కెరీర్‌ను నాశనం చేయాలనే ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. అయితే షమీ ట్వీట్‌ చేసిన మరికొద్ది క్షణాల్లోనే హాసిన్‌ జాహన్‌ పోస్ట్‌ చేసిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడం చర్చనీయాంశమైంది.

Story first published: Wednesday, March 7, 2018, 17:22 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి