న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs PAK 1st T20: డ్రీమ్ 11, ప్రిడిక్షన్స్, పిచ్ రిపోర్ట్ ఇలా..: క్రికెట్ ప్రేమికులకు కనువిందు

WI vs PAK 1st T20 Series: Dream11, Playing 11 And Match Prediction Details

సెయింట్ జాన్స్: ఆస్ట్రేలియాతో వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 సిరీస్‌ను ముగించుకున్న వెస్టిండీస్..పాకిస్తాన్‌తో తలపడనుంది. పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. కరేబియన్లతో నాలుగు టీ20, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో తొలి టీ20 భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం ప్రారంభం కానుంది. బార్బడోస్‌లోని కింగ్స్‌టన్ ఓవల్ ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. బలమైన ఆస్ట్రేలియా జట్టుపై 4-1 తేడాతో సిరీస్‌ను గెలిచిన ఆత్మ విశ్వాసం వెస్టిండీస్‌లో కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను ముగించుకున్న పాకిస్తాన్ జట్టు కూడా అదే స్థాయిలో ఊపు మీద ఉంది.

బార్బడోస్‌లోని కింగ్స్‌టన్ ఓవల్ స్టేడియంలో ఇటీవలే ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌కు వేదికైంది. ఈ పిచ్‌పై ఛేజింగ్ కష్టమనేది ఈ మ్యాచ్‌లు ప్రూవ్ చేశాయి. బౌన్సీ పిచ్ కావడం వల్ల పేసర్లు చెలరేగడానికి అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా కింగ్స్‌టన్ ఓవల్‌ పిచ్‌పై 17 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. 12 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. దీన్ని బట్టి చూస్తే- లక్ష్యాన్ని ఛేదించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఈ పిచ్‌పై యావరేజ్ స్కోర్ 154. బార్బడోస్‌లో తేలికపాటి వర్షం పడే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడవచ్చు.

వెస్టిండీస్ తరఫున లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లెవిస్, క్రిస్ గేల్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), కీరన్ పొల్లార్డ్ (కేప్టెన్), ఆండ్రీ రస్సెల్, ఫ్యాబియన్ అల్లెన్, డ్వేన్ బ్రావో, హెడెన్ వాల్ష్ జూనియర్. ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఓబెడ్ మెక్‌కే తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. షిమ్రోన్ హెట్మెయిర్, జేసన్ హోల్డర్, ఆండ్రీ ఫ్లెచర్, షెల్డన్ కాట్రెల్, అకీల్ హొస్సేన్, కెవిన్ సింక్లయిర్, ఒషానె థామస్ బెంచ్‌కు పరిమతం కావచ్చే అంచనాలు ఉన్నాయి.

పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మక్సూద్, ఆజమ్ ఖాన్, ఇమద్ వసీం, ఫహీమ్ అష్రాఫ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది తుది జట్టుకు ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. షర్జీల్ ఖాన్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, అర్షద్ ఇక్బాల్, హ్యరీస్ రవూఫ్, మహ్మద్ హొస్నయిన్ బెంచ్‌కు పరిమతం అవుతారు.

Story first published: Wednesday, July 28, 2021, 11:27 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X