న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10,000 ODI runs: 500 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా క్రిస్ గేల్

WI vs Eng : Chris Gayle Completes 10,000 ODI Runs And 500 Sixes | Oneindia Telugu
WI vs Eng: Chris Gayle completes 10,000 ODI runs; shatters record books with his 162-run knock against England

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్‌లో క్రిస్ గేల్ విజృంభించి ఆడాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. వన్డేల్లో క్రిస్ గేల్‌కు ఇది 25వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్ గేల్ వన్డేల్లో వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు.

మ్యాక్స్‌వెల్ 113 నాటౌట్: రెండో టీ20లో ఆసీస్ విజయం, 11 ఏళ్ల తర్వాత సిరిస్ కైవసంమ్యాక్స్‌వెల్ 113 నాటౌట్: రెండో టీ20లో ఆసీస్ విజయం, 11 ఏళ్ల తర్వాత సిరిస్ కైవసం

వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కాగా, వెస్టిండీస్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా గేల్‌ గుర్తింపు సాధించాడు. అంతకముందు విండిస్ తరుపున వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగుల మైలురాయిని బ్రియాన్ లారా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ మొత్తం 14 సిక్సులు బాదాడు.

ఐదు వందలు సిక్సర్‌ బాదిన తొలి ఆటగాడిగా

దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వందలు సిక్సర్‌ బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో షాహిద్‌ ఆఫ్రిది(476 సిక్సర్లు) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును క్రిస్ గేల్ బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ సెంచరీ సాధించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. గేల్‌కు జతగా డారెన్‌ బ్రేవో(61), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌(50), ఆశ్లే నర్స్‌(43)లు రాణించారు.

419 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో

419 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో

ఇంగ్లాండ్ నిర్దేశించిన 419 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండిస్ జట్టు 48 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ ఐదు వికెట్లు సాధించగా, మార్క్‌ వుడ్‌ నాలుగు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది.

నాలుగో వికెట్‌కు 204 పరుగులు

నాలుగో వికెట్‌కు 204 పరుగులు

ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్‌ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడాడు. జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.

వన్డేల్లో 400పై స్కోరు సాధించడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి

వన్డేల్లో 400పై స్కోరు సాధించడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి

ఫలితంగా ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ మొత్తం 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా నిలిచింది. ఇదే సిరీస్‌‌లో తొలి వన్డేలో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నెలకొల్పిన 23 సిక్స్‌ల రికార్డును అధిగమించారు. వన్డేల్లో 400పై స్కోరు సాధించడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ గెలవగా, రెండో వన్డేలో విండిస్ విజయం సాధించింది. వర్షం కారణంగా మూడో వన్డే రద్దయ్యింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే శనివారం జరుగనుంది.

Story first published: Thursday, February 28, 2019, 12:12 [IST]
Other articles published on Feb 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X